News

ఏఐ యుగంలో హైదరాబాద్‌ గ్రంథాలయాలకు కొత్త ఊపిరి ఎప్పుడు?

83 పౌర గ్రంథాలయాలు.. 21 మంది సిబ్బంది | అటెండర్లు, స్వీపర్లతోనే నిర్వహణ | డిజిటలైజేషన్‌, ఆధునిక వసతులకు యువత డిమాండ్‌

హైదరాబాద్‌: గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలు దాచే గది కాదు.. అది విజ్ఞాన భాండాగారం. మనిషి ఆలోచనా పరిధిని విస్తరించే వేదిక. పుస్తకం చదివే అలవాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంతో పాటు సమాజాన్ని చైతన్యవంతం చేస్తుంది. అయితే విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్‌లో పౌర గ్రంథాలయాలు మాత్రం కాలానుగుణంగా అభివృద్ధి చెందడం లేదు. నగరంలో 83 పౌర గ్రంథాలయాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణకు సరిపడా సిబ్బంది, ఆధునిక సాంకేతిక వసతులు, డిజిటల్‌ సేవలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌ నగర గ్రంథాలయ సంస్థ పరిధిలోని పౌర గ్రంథాలయాల్లో కేవలం 21 మంది రెగ్యులర్‌ సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో కొన్ని గ్రంథాలయాల్లో అటెండర్లు, స్వీపర్లే గ్రంథాలయాల నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 60 మంది లైబ్రేరియన్లను నియమిస్తేనే నగరంలోని పౌర గ్రంథాలయ వ్యవస్థకు పునరుజ్జీవం వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యువతతో కళకళలాడుతున్న లైబ్రరీలు

హైదరాబాద్‌లోని పౌర గ్రంథాలయాల్లో ప్రస్తుతం యువతీ, యువకుల సందడి కనిపిస్తోంది. అయితే వీరిలో ఎక్కువమంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులే. గ్రూప్స్‌, సివిల్స్‌, బ్యాంకింగ్‌, ఎస్‌ఎస్‌సీ, రైల్వే తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయాలు చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.

అయితే ఇదే వేదికను యువతలో సాహిత్య పఠనాసక్తిని పెంపొందించేందుకు ఉపయోగించుకోవచ్చని సాహిత్యాభిమానులు సూచిస్తున్నారు. పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ సాహిత్యం, జీవిత చరిత్రలు, చరిత్ర, విజ్ఞానం, తత్వశాస్త్రం, సమకాలీన అంశాలపై పుస్తకాలను అందుబాటులో ఉంచితే యువత చదువుపై మరింత ఆసక్తి పెంచుకునే అవకాశం ఉంటుంది.

అటెండర్లే గ్రంథ పాలకులు!

ఒకప్పుడు సామాజిక చైతన్యానికి, స్వాభిమాన పోరాటాలకు దిశానిర్దేశం చేసిన గ్రంథాలయాలు ప్రస్తుతం నిర్వహణపరమైన సమస్యలతో సతమతమవుతున్నాయి. లైబ్రేరియన్లు లేకపోవడంతో కొన్ని చోట్ల అటెండర్లు, స్వీపర్లు గ్రంథాలయాల బాధ్యతలు నిర్వహిస్తున్నారని సంగిశెట్టి శ్రీనివాస్‌ పేర్కొంటున్నారు.

గ్రంథాలయం సక్రమంగా పనిచేయాలంటే పుస్తకాల నిర్వహణతో పాటు పాఠకులకు అవసరమైన పుస్తకాలను సూచించడం, కొత్త పుస్తకాలను పరిచయం చేయడం, పఠన కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లలు-యువతను చదువువైపు ఆకర్షించడం వంటి బాధ్యతలు లైబ్రేరియన్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకే లైబ్రేరియన్ల నియామకం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.

కోఫోర్జ్‌ లైబ్రరీ.. కొత్త సంస్కృతికి నాంది

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన కోఫోర్జ్‌ లైబ్రరీ నగరంలో ఆధునిక గ్రంథాలయ సంస్కృతికి ఉదాహరణగా నిలుస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో 15 వేలకుపైగా పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

365 రోజులూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠకులకు అందుబాటులో ఉండే ఈ గ్రంథాలయం ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులు, యువత, పిల్లలకు ఉపయోగకరంగా మారింది. ఈ తరంలో పుస్తక పఠనం తగ్గిపోయిందనే అభిప్రాయానికి విరుద్ధంగా యువత అచ్చు పుస్తకాలపై ఆసక్తి చూపుతున్నదానికి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌, హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లకు లభిస్తున్న ఆదరణ కూడా నిదర్శనంగా నిలుస్తోంది.

ఏఐ యుగంలోనూ పుస్తకానికి ఆదరణ

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), ఈ-బుక్స్‌, ఆడియోబుక్స్‌, యూట్యూబ్‌, ఓటీటీ వంటి డిజిటల్‌ వేదికలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అచ్చు పుస్తకాలకు ఉన్న ఆదరణ తగ్గలేదని పఠనాభిమానులు చెబుతున్నారు.

పుస్తకం చదవడం ద్వారా లభించే ఏకాగ్రత, ఆలోచనా శక్తి, ఊహాశక్తి డిజిటల్‌ కంటెంట్‌తో పూర్తిగా భర్తీ చేయలేమని సాహిత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఏఐ యుగంలో ఆధునిక లైబ్రరీలు మరింత అవసరమవుతున్నాయి.

హైదరాబాద్‌కు ఆధునిక పౌర గ్రంథాలయం అవసరం

విశ్వనగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో పూర్తిస్థాయి ఆధునిక సెంట్రల్‌ పబ్లిక్‌ లైబ్రరీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోని ప్రముఖ నగరాలు తమ పబ్లిక్‌ లైబ్రరీలను డిజిటల్‌ సాంకేతికతతో అనుసంధానం చేస్తుండగా హైదరాబాద్‌లో మాత్రం పౌర గ్రంథాలయాల మౌలిక వసతులే ఇంకా అనేక చోట్ల సమస్యగా ఉన్నాయి.

న్యూయార్క్‌ పబ్లిక్‌ లైబ్రరీలో లక్షలాది పుస్తకాలు, ఆడియో పుస్తకాలు అందుబాటులో ఉండటంతో పాటు సభ్యులు వెబ్‌సైట్‌, యాప్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికల ద్వారా పుస్తకాలను యాక్సెస్‌ చేసే సదుపాయం ఉంది. ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకిలోని ఓడి సెంట్రల్‌ లైబ్రరీలో పాఠకుల కోసం ఆడియో, వీడియో స్టూడియోలు వంటి ఆధునిక సదుపాయాలు కూడా ఉన్నాయి.

డిజిటలైజేషన్‌పై దృష్టి పెట్టాలి

హైదరాబాద్‌లోని గ్రంథాలయాల్లో ఉన్న పాత పుస్తకాలు, పత్రికలు, అరుదైన రాతప్రతులు, తాళపత్ర గ్రంథాలు విలువైన చారిత్రక సంపదగా నిలుస్తున్నాయి. వాటిని సంరక్షించేందుకు డిజిటలైజేషన్‌ చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికే కొన్ని పాత పత్రికలు, పుస్తకాలను డిజిటలైజ్‌ చేసినప్పటికీ వాటిని పాఠకులకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని సంగిశెట్టి శ్రీనివాస్‌ సూచిస్తున్నారు. డిజిటల్‌ ఆర్కైవ్‌ ఏర్పాటు చేస్తే పరిశోధకులు, విద్యార్థులు, చరిత్రకారులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అరుదైన సమాచారాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

రీడింగ్‌ రూమ్‌లుగా మాత్రమే మిగలకూడదు

ప్రస్తుతం అనేక పౌర గ్రంథాలయాలు రీడింగ్‌ రూమ్‌లుగా మాత్రమే పరిమితమవుతున్నాయనే విమర్శ ఉంది. పోటీ పరీక్షల అభ్యర్థులు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో గ్రంథాలయాలకు వస్తున్న నేపథ్యంలో వారికి పరీక్షల పుస్తకాలతో పాటు సాహిత్య పుస్తకాలను కూడా పరిచయం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లల కోసం ప్రత్యేక పఠన విభాగాలు, యువత కోసం సాహిత్య క్లబ్‌లు, పుస్తక చర్చలు, రచయితలతో సమావేశాలు, కథా పఠనం, పుస్తక సమీక్షలు, డిజిటల్‌ లైబ్రరీ సేవలు, ఈ-లైబ్రరీ యాక్సెస్‌, ఆడియో-విజువల్‌ సదుపాయాలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ పౌర గ్రంథాలయాలు కొత్త తరానికి మరింత చేరువయ్యే అవకాశం ఉంది.

పుస్తకంతోనే విజ్ఞాన విప్లవం

సోషల్‌ మీడియా ఖాతాల్లో వేలాది మంది స్నేహితులు ఉన్నా ఇవ్వలేని ఆత్మస్థైర్యాన్ని ఒక మంచి పుస్తకం ఇవ్వగలదు. ఓటీటీ, యూట్యూబ్‌లలో ఎన్నో కార్యక్రమాలు చూసినా లభించని ఆలోచనా ఆనందాన్ని పుస్తక పఠనం అందిస్తుంది. అందుకే “పుస్తకం మనిషిని ఉన్నతీకరిస్తుంది” అనే భావనకు నేటికీ ప్రాధాన్యం ఉంది.

హైదరాబాద్‌లోని 83 పౌర గ్రంథాలయాలను కేవలం పోటీ పరీక్షల కేంద్రాలుగా కాకుండా విజ్ఞాన కేంద్రాలు, సాంస్కృతిక కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, సాహిత్య వేదికలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సరిపడా లైబ్రేరియన్ల నియామకం, ఆధునిక మౌలిక వసతులు, అరుదైన పుస్తకాల డిజిటలైజేషన్‌, యువతలో పఠనాసక్తి పెంపు.. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వం, గ్రంథాలయ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు, సాహిత్య సంస్థలు కలిసి పనిచేస్తే హైదరాబాద్‌ గ్రంథాలయాలకు కొత్త ఊపిరి పోయవచ్చు.

To get more interesting news, click the link below.

Telangana TV

Hyderabad Public Libraries Struggle With Staff Shortage, Need Modernisation

Hyderabad Public Libraries Face Staff Shortage

83 civic libraries serve the city, but only 21 regular staff members are reportedly working; experts call for more librarians, digitalisation and modern library services

Hyderabad: Libraries are often described as the treasure houses of knowledge. They bring the world closer to readers, broaden their thinking and introduce them to new ideas, perspectives and possibilities. Even in the age of Facebook, X, YouTube, OTT platforms and artificial intelligence, the importance of Hyderabad Public Libraries and the habit of reading books remain significant.

Hyderabad has 83 civic public libraries, which continue to attract large numbers of young people. However, most of the youngsters visiting these libraries are students preparing for competitive examinations. Library experts and literary enthusiasts believe that this growing youth presence offers a major opportunity to revive the reading culture and encourage young readers to explore literature, history, biographies, science and other subjects beyond competitive-examination material.

The larger concern, however, is the shortage of professional staff and the lack of modern facilities across several public libraries in Hyderabad.

Only 21 regular staff for 83 libraries

The Hyderabad City Library Organisation reportedly has only 21 regular employees working across its civic libraries. The severe shortage of trained library staff has affected the functioning of several Hyderabad Public Libraries.

Historian and researcher Sangishetti Srinivas has expressed concern that in some places, attendants and sweepers are reportedly managing library operations in the absence of adequate librarians.

Experts believe that the government should appoint at least 60 librarians to strengthen the city’s public library network. Professional librarians are essential not only for maintaining books but also for helping readers discover relevant literature, organising reading programmes, preserving rare collections and developing a strong reading culture among children and young people.

The shortage of librarians raises a larger question: can public libraries become modern knowledge centres without adequate professional staff?

Youngsters dominate Hyderabad libraries

Despite the challenges, Hyderabad libraries continue to witness a steady flow of young readers. Competitive examination aspirants form a major portion of the library-going population.

Students preparing for civil services, Group examinations, banking, SSC, railway and other competitive examinations regularly use public libraries as affordable study spaces.

This trend could also become an opportunity to promote reading habits among youth. Experts say libraries should provide competitive examination material alongside Telugu, Hindi and English literature, biographies, history, science, philosophy, current affairs and other knowledge-based books.

Book clubs, literary discussions, author interactions, storytelling sessions and book-review programmes could further encourage young people to develop a long-term reading habit.

Coforge Library shows a different model

A notable example of modern library culture is the Coforge Library in Kondapur, established under Corporate Social Responsibility (CSR).

The library reportedly houses more than 15,000 books in Telugu, Hindi and English. It remains accessible to readers throughout the year, offering a reading space for young people, children and professionals working in Hyderabad’s IT corridor.

The response to the library also challenges the perception that young people are no longer interested in physical books.

The popularity of the Hyderabad Book Fair and Hyderabad Literary Festival, along with the growing interest in libraries such as the Coforge Library, indicates that printed books continue to have a strong place in the digital age.

AI age makes modern libraries more important

The rise of artificial intelligence, e-books, audiobooks, YouTube and OTT platforms has transformed the way people consume information and entertainment. Yet these developments have not eliminated the need for physical libraries.

In fact, the AI era could make modern public libraries even more important.

Libraries can evolve into knowledge and community centres by combining physical books with digital resources. High-speed internet, digital catalogues, e-library access, online membership, digitised archives, audio-visual facilities and technology-enabled reading spaces can make libraries more useful to the next generation.

For a city aspiring to be a global technology and knowledge hub, the absence of a fully developed modern public library system remains a concern.

Lessons from New York and Helsinki

Internationally, several major cities have transformed their public libraries into modern knowledge centres.

The New York Public Library offers extensive collections of books and audio resources, while its digital services allow members to access library resources through online platforms.

Similarly, the Oodi Central Library in Helsinki, Finland, has gone beyond the traditional concept of a library. In addition to books and reading spaces, it provides visitors with facilities such as audio and video studios.

These models demonstrate how modern public libraries can combine books, technology, creativity and community services under one roof.

Hyderabad too can develop libraries that serve not only as reading rooms but also as knowledge, learning and cultural hubs.

Digitalisation of rare books is crucial

Hyderabad has an important collection of old newspapers, rare books, manuscripts and palm-leaf records. Many of these resources have historical and research value.

Experts believe that such materials should be carefully preserved through library digitalisation.

Some old newspapers and books in Hyderabad’s libraries have reportedly already been digitised. However, these digital archives should be made easily accessible to students, researchers, historians and ordinary readers.

A comprehensive digital library in Hyderabad could help preserve fragile historical material while allowing a much larger audience to access it.

Digitalisation would also reduce the pressure on physical copies and protect valuable collections from deterioration.

Libraries should not remain just reading rooms

One of the key demands from library enthusiasts is that public libraries should not remain limited to being silent reading rooms.

With thousands of competitive examination aspirants visiting libraries every day, authorities can use these spaces to introduce young readers to literature and knowledge beyond examinations.

Dedicated children’s sections, youth reading clubs, literary events, digital learning zones, author interactions, book discussions and online library services could transform Hyderabad Public Libraries into vibrant community institutions.

Libraries can also collaborate with educational institutions, publishers, writers, literary organisations and corporate CSR initiatives to expand their collections and services.

Need for a new library vision for Hyderabad

Hyderabad has emerged as a major IT, business, education and cultural centre. Its library infrastructure needs to reflect that transformation.

The city requires a comprehensive strategy covering librarian recruitment, library modernisation, digitalisation, preservation of rare books, technology integration and promotion of reading habits.

The 83 civic libraries can become important knowledge centres if they receive adequate funding, professional staff and modern infrastructure.

The growing presence of young people in Hyderabad Public Libraries proves that the demand for quiet and affordable learning spaces still exists. What is needed now is a broader vision that turns these libraries from examination preparation centres into institutions that promote lifelong learning and reading.

A book still has the power to transform lives

Social media can connect people with thousands of followers, while YouTube and OTT platforms provide endless entertainment. But a good book can offer something different—reflection, knowledge, imagination, confidence and a deeper understanding of the world.

That is why the idea that books elevate human beings continues to remain relevant.

For Hyderabad, strengthening its public libraries is not simply about maintaining old buildings and books. It is about investing in knowledge, young people, education, culture and the intellectual future of the city.

With professional librarians, modern infrastructure, digital services and a renewed focus on literature, Hyderabad Public Libraries can once again become powerful centres of knowledge and social transformation.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *