నేపాల్ వరదల్లో శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు.. 10 రోజుల తర్వాత.

నేపాల్లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఆగస్టు 26న సంభవించిన ఈ వరదలు హిమానీనదం కూలిపోవడం వల్ల ఏర్పడి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 1,300 మంది మరణించగా, మరో 5,000 మందికి పైగా గల్లంతయ్యారని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరదలు, బురద, శిథిలాల మధ్య సహాయక బృందాలు రోజుల తరబడి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బురద, శిథిలాల మధ్య 10 రోజులుగా చిక్కుకున్న ఓ చైనా కార్మికుడితో పాటు 64 ఏళ్ల నేపాల్ వృద్ధురాలిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి.
జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగంలో చిక్కుకున్న ఓ చైనా కార్మికుడిని సహాయక బృందాలు సజీవంగా బయటకు తీశాయి. శుక్రవారం ఇదే ప్రాంతంలోని త్రిశూలి 3A జలవిద్యుత్ కేంద్రం సొరంగం నుంచి ఇద్దరు నేపాలీ కార్మికులను రక్షించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కార్మికుడిని కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నేపాల్ సైనిక సిబ్బంది, దక్షిణ కొరియాకు చెందిన విపత్తు నిర్వహణ నిపుణులు కలిసి ఈ రక్షణ చర్యలు చేపట్టారు. 225 మీటర్ల పొడవైన సొరంగం నుంచి కార్మికుడిని బయటకు తీసుకొచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, నువాకోట్ పట్టణంలో 64 ఏళ్ల చండికా శ్రేష్ఠ అనే వృద్ధురాలిని కూడా శనివారం సహాయక బృందాలు సజీవంగా రక్షించాయి. దెబ్బతిన్న ఇంటి శిథిలాల కింద 10 రోజులుగా చిక్కుకున్న ఆమెను సిబ్బంది ఎంతో శ్రమించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో ఖాట్మండూకు తరలించారు. 10 రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకున్నప్పటికీ ఆమె ప్రాణాలతో బయటపడటం అద్భుతంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆమెను రక్షిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
To get more interesting news, click the link below.
Two Trapped in Debris After Nepal Floods Rescued After 10 Days

Nepal has witnessed massive destruction following severe floods and landslides in recent days. The floods, which occurred on August 26, may have been triggered by a glacier collapse, according to officials.
The Nepal Disaster Management Authority reported that at least 1,300 people have died so far, while more than 5,000 others remain missing. Rescue teams have been conducting search and rescue operations for several days amid floodwaters, mud and debris.
During the rescue operations, teams safely rescued a Chinese worker who had been trapped for 10 days, along with a 64-year-old Nepali woman.
The Chinese worker was rescued alive from a tunnel belonging to a hydropower project. On Friday, two Nepali workers had already been rescued from a tunnel at the Trishuli 3A Hydropower Plant in the same area. The Chinese worker was subsequently brought out safely.
Nepalese military personnel and disaster management experts from South Korea jointly carried out the rescue operation. The worker was rescued from the 225-metre-long tunnel and immediately underwent a medical examination. He was later airlifted by helicopter to a hospital for further treatment.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates
