అసెంబ్లీ గేటు వద్ద మహిళా పోలీసులపై దాడి.. మంత్రి సీతక్క పరామర్శ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. అసెంబ్లీ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రవర్తన, తమపై జరిగిన దాడి, ఎదుర్కొన్న ఇబ్బందులను మహిళా పోలీసు అధికారులు మంత్రికి వివరించారు.
మహిళా పోలీసుల ఆవేదన
అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మహిళా పోలీసు అధికారులు మంత్రి సీతక్కకు వివరించారు. విధి నిర్వహణలో భాగంగా తాము అక్కడ విధులు నిర్వర్తిస్తుండగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసభ్యంగా ప్రవర్తించారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
తమను అసభ్యంగా తాకారని, ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో విజువల్స్‌ను కూడా మంత్రి సీతక్కకు చూపించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
“టీ షర్టులు విసిరి మా మీదికి వచ్చారు”
“మా డ్యూటీలు మేము చేసుకుంటుంటే టీ షర్టులు విసిరేసి మా మీదికి వచ్చారు. విధి నిర్వహణలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం” అని మహిళా పోలీసులు మంత్రి సీతక్క వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతు చూస్తామని బెదిరించారని మహిళా పోలీసులు మంత్రికి వివరించినట్లు సమాచారం. విధుల్లో ఉన్న మహిళా పోలీసుల పట్ల ఇలాంటి ప్రవర్తన తమను తీవ్రంగా కలచివేసిందని వారు పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల ఆందోళన
అసెంబ్లీ గేటు వద్ద చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో విజువల్స్ బయటకు రావడంతో తమ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మహిళా పోలీసులు మంత్రికి వివరించారు.
“ఇలాంటి డ్యూటీలు చేయాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తోంది” అని వారు తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం.
విధి నిర్వహణలో ఎదురైన పరిణామాలతో తాము మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూడాలని మహిళా పోలీసులు మంత్రి సీతక్కను కోరినట్లు తెలుస్తోంది.
మహిళా పోలీసులకు సీతక్క భరోసా
మహిళా పోలీసుల ఆవేదనను విన్న మంత్రి సీతక్క వారికి ధైర్యం చెప్పారు. విధి నిర్వహణలో భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
“ధైర్యంగా ఉండండి.. మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ డ్యూటీ మీరు చేయండి. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు” అని మంత్రి సీతక్క మహిళా పోలీసులకు ధైర్యం చెప్పినట్లు సమాచారం.
విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మహిళా పోలీసులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – పోలీసులు మధ్య జరిగిన ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
మహిళా పోలీసులపై దాడి జరిగిందన్న ఆరోపణలు, అసభ్య ప్రవర్తనకు సంబంధించిన విజువల్స్, విధి నిర్వహణలో పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఘటనపై మహిళా పోలీసులు మంత్రి సీతక్కకు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
To get more interesting news, click the link below.
Telangana Assembly Gate Incident Seethakka Meets Women Police, Assures Government Support

Hyderabad: Telangana Minister Seethakka met women police personnel who were allegedly injured during a confrontation involving BRS MLAs and MLCs at the Telangana Assembly gate on Monday. The women police officers explained the details of the incident to the minister and expressed concern over the alleged behaviour of some BRS legislators.
According to the women police officers, they were performing their duties at the Telangana Assembly gate when the situation turned tense. They alleged that some BRS MLAs and MLCs behaved inappropriately with them and that they were subjected to physical contact while they were on duty.
Women Police Show Visual Evidence to Seethakka
The women police officers reportedly showed photographs and video visuals related to the Telangana Assembly incident to Minister Seethakka while explaining what happened.
The officers alleged that some BRS leaders crossed the line while they were trying to perform their official responsibilities. They also expressed their distress over the circulation of visuals of the incident.
The women police officers told Seethakka that their family members were upset after seeing the visuals and were worried about their safety while performing duties at politically sensitive locations.
“They Threw T-Shirts and Came Towards Us”
The women police officers described the difficulties they allegedly faced during the incident.
They said that while they were performing their duties, T-shirts were allegedly thrown at them and some people moved towards them, making it difficult for them to maintain security arrangements at the Assembly gate.
The officers also alleged that they were threatened with consequences if the BRS returned to power.
The alleged threats and behaviour, they said, had created considerable stress among their families, with some family members questioning whether they should continue taking up such duties.
Seethakka Assures Women Police of Government Support
Minister Seethakka listened to the concerns of the women police officers and assured them that they should not be intimidated by threats while carrying out their official responsibilities.
Seethakka reportedly told the women police officers:
The minister’s assurance comes amid growing political attention surrounding the Telangana Assembly gate incident and the allegations made by the women police personnel.
Telangana Assembly Incident Triggers Political Debate
The alleged incident involving BRS MLAs, BRS MLCs and women police personnel at the Telangana Assembly has become a subject of political discussion.
The allegations made by the women police officers, including claims of inappropriate behaviour, physical contact and threats, have added another dimension to the political confrontation at the Assembly gate.
The Telangana Assembly is a high-security location where police personnel are deployed to regulate movement and maintain security during Assembly sessions. Any confrontation involving elected representatives and police personnel can therefore become politically and administratively significant.
The allegations made by the women police officers are expected to draw further attention as political parties respond to the incident.
Focus on Safety of Women Police Personnel
The incident has also brought renewed focus on the safety and dignity of women police personnel performing their duties at sensitive locations.
Police officers deployed for security and crowd management are required to perform their responsibilities regardless of political pressure or the identity of the individuals involved. The women police officers’ complaint to Minister Seethakka has highlighted the challenges faced by female personnel during high-tension political situations.
The government has assured the affected women police officers of its support, while further developments regarding the allegations could determine the next course of action.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates
