NewsPolitics

అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే: సునీతా లక్ష్మారెడ్డి.. మహిళా నేతలపై పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమీపంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన తమను పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో మహిళా నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే: సునీతా లక్ష్మారెడ్డి

అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సాక్షిగా మహిళా సభ్యులను అవమానించారని ఆమె ఆరోపించారు.

ఈ ఘటనను తాము ‘దుశ్శాసన పర్వం’గా భావిస్తున్నామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మహిళా నేతలను అడ్డుకునే క్రమంలో గొంతు పట్టడం, జుట్టు లాగడం, చీర లాగడం వంటి చర్యలకు పాల్పడటం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

“మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా?” అంటూ సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరిగి ఉండదని ఆమె వ్యాఖ్యానించారు.

మహిళా సభ్యులకే రక్షణ లేదా?

అసెంబ్లీకి ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అసెంబ్లీకి వెళ్తున్న మహిళా నేతలను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.

అసెంబ్లీ పరిసరాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. తాము అసెంబ్లీకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని ఆమె తెలిపారు.

“ప్రభుత్వం విఫలమైందని మాత్రమే మేము ఆరోపించాం. అందుకు మమ్మల్ని అవమానించాలని ఎవరు ఆదేశించారు?” అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

మహిళా నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా కేటీఆర్ సమయానికి అక్కడికి రాకపోయి ఉంటే మహిళా నేతలను కిందపడేసి తొక్కేవారని ఆమె ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

అసెంబ్లీకి వచ్చే మహిళా సభ్యులకే రక్షణ లేకపోవడం దారుణమని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయంగా వేడెక్కిన తెలంగాణ

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య పలు అంశాలపై తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన ఘటన కొత్త రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది.

మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, అసెంబ్లీ ప్రాంగణంలో భద్రత, పోలీసుల వ్యవహారశైలిపై ఇప్పుడు రాజకీయ చర్చ మొదలైంది. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

To get more interesting news, click the link below.

Telangana TV

Telangana Assembly Row Sunitha Lakshma Reddy Calls Incident a ‘Black Day’

Sunitha Lakshma Reddy speaks on Telangana Assembly incident

Hyderabad: A major political controversy has erupted over an alleged incident involving former minister and BRS leader Sunitha Lakshma Reddy near the Telangana Assembly. BRS leaders have strongly condemned what they described as the alleged pulling of Sunitha Lakshma Reddy’s saree by police personnel while she was reportedly trying to enter the Assembly.

Reacting sharply to the incident, Sunitha Lakshma Reddy termed it a “black day in the history of the Telangana Assembly” and accused the authorities of humiliating women legislators in the presence of the Assembly.

The incident has triggered a fresh confrontation between the opposition BRS and the ruling Congress government in Telangana, with BRS leaders demanding accountability and an apology from Chief Minister A Revanth Reddy.

Sunitha Lakshma Reddy Calls It a ‘Black Day’

Speaking about the alleged incident, Sunitha Lakshma Reddy said the episode would remain a dark chapter in the history of the Telangana Assembly.

She described the incident as a “Dushasana Parvam”, drawing a comparison with the humiliation of Draupadi in the Mahabharata. Sunitha Lakshma Reddy alleged that women members were insulted in front of the Assembly and questioned the manner in which the police allegedly handled the situation.

She questioned the alleged acts of holding women by the throat and pulling their hair, asking how such conduct could be justified against elected women representatives.

“Is humiliating women the meaning of Indiramma Rajyam?” she asked, targeting the Telangana government.

According to Sunitha Lakshma Reddy, such an incident involving women legislators would be unprecedented in the political history of the country.

BRS Leaders Condemn Alleged Police Action

The alleged Sunitha Lakshma Reddy saree pulling incident has drawn strong criticism from BRS leaders. The opposition party has accused the government of failing to ensure the dignity and safety of women legislators.

BRS leaders maintained that elected representatives should be allowed to enter the Assembly and raise issues concerning the people without being subjected to humiliating treatment.

The controversy has also raised questions over the security and conduct of police personnel deployed around the Telangana Assembly during politically sensitive situations.

Sabitha Indra Reddy Calls Incident ‘Heinous’

Former minister Sabitha Indra Reddy also strongly condemned the incident near the Telangana Assembly.

Sabitha Indra Reddy said that BRS women leaders were stopped while they were proceeding towards the Assembly. She stated that their criticism was directed only at the government’s alleged failure and questioned why they were allegedly subjected to humiliating treatment.

She demanded to know who had instructed officials to treat the women leaders in such a manner.

Sabitha Indra Reddy further alleged that the situation could have become even worse if BRS working president K T Rama Rao had not arrived at the spot in time. She claimed that the women leaders could have been pushed to the ground and allegedly trampled.

‘No Protection Even for Women MLAs’

The former minister questioned the security arrangements for women legislators visiting the Telangana Assembly.

“If women members of the Assembly themselves are not safe, what protection is available to ordinary women?” BRS leaders asked while condemning the alleged incident.

The issue has now become a major political flashpoint in Telangana, with the opposition demanding an explanation from the government.

Sabitha Demands Apology from Revanth Reddy

Sabitha Indra Reddy demanded that Telangana Chief Minister Revanth Reddy take responsibility for the incident and apologise.

The BRS has maintained that the alleged treatment of women leaders is unacceptable and that the government must explain what happened near the Assembly.

The ruling Congress government’s response to the allegations is now being closely watched as the controversy continues to intensify.

Telangana Politics Heats Up

The Sunitha Lakshma Reddy Telangana Assembly incident has added another flashpoint to the ongoing political confrontation between the BRS and Congress in Telangana.

With BRS leaders repeatedly raising the issue of the alleged police action against women leaders, the controversy is likely to dominate political discussions surrounding the Assembly.

The incident has also brought the issues of women legislators’ dignity, Assembly security and police conduct into sharp focus.

As the political row escalates, all eyes are now on the Telangana government and whether it will respond to the allegations raised by Sunitha Lakshma Reddy, Sabitha Indra Reddy and other BRS leaders.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *