ఉద్యోగులకు తీపి కబురు: రూ.745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల

హైదరాబాద్ ఫిబ్రవరి 27 (సత్య తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు Telangana Government శుభవార్త అందించింది. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి Mallu Bhatti Vikramarka ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు శుక్రవారం రూ.745 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేశారు.
ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల అనంతరం బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసింది. తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో నెలకొన్న ఆర్థిక ఒత్తిడి కొంత మేర తగ్గినట్లైంది.
అదే సమయంలో గ్రామీణాభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం అదనంగా రూ.389 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో నిలిచిపోయిన పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మొత్తంగా రూ.1,134 కోట్ల నిధుల విడుదలతో ఉద్యోగులు, గ్రామీణ అభివృద్ధి రంగానికి గణనీయమైన ఊరట లభించిందని ప్రభుత్వం భావిస్తోంది.

