బీసీలకు జనాభా నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి-గుజ్జ సత్యం
బీసీలకు జనాభా నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. టీసీ ఇంటెలెక్టువల్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన సామాజిక న్యాయ పోరాట సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన రక్షణ కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం, బీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా, కులగణనలో ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని కోరారు.
Read More