Lifestyle

కాఫీ తాగడం ఇష్టమా? అయితే సరైన సమయంలో తాగితేనే పూర్తి ప్రయోజనం

చాలామందికి ఉదయం కాఫీ తాగకపోతే రోజు ప్రారంభమే కానట్టు అనిపిస్తుంది. కాఫీతో శరీరానికి ఉత్సాహం వస్తుందని చాలా మంది భావిస్తారు. నిజానికి కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు పార్కిన్సన్స్, ఆల్జీమర్స్, డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కాఫీ వల్ల పూర్తి ప్రయోజనం పొందాలంటే సరైన సమయంలో తాగడం, కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమని సూచిస్తున్నారు.

నిపుణుల ప్రకారం, ఉదయం నిద్రలేవగానే వెంటనే కాఫీ తాగడం మంచిది కాదు. ఆ సమయంలో శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నిద్రలేచిన తర్వాత కనీసం గంట నుంచి గంటన్నర గడిచిన తర్వాత కాఫీ తాగితే శరీరానికి మంచిదని చెబుతున్నారు.

మధ్యాహ్నం అలసటగా అనిపించినప్పుడు ఎనర్జీ కోసం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య కాఫీ తాగడం మంచిది. అలాగే జిమ్‌లో వ్యాయామం చేయడానికి గంట ముందు కాఫీ తాగితే శక్తి పెరిగి మంచి ఫలితం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే రాత్రి నిద్రపై ప్రభావం పడకుండా ఉండాలంటే సాయంత్రం తర్వాత కాఫీ తాగడం తగ్గించడం మంచిదని చెబుతున్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు మూడు నుంచి నాలుగు కప్పులకంటే ఎక్కువ కాఫీ తాగకూడదు. కాఫీ ఎక్కువగా తాగే వారు తగినంత నీరు కూడా తీసుకోవాలి. అలాగే కాఫీలో చక్కెర లేదా ఇతర అదనపు పదార్థాలను తగ్గిస్తే ఆరోగ్యానికి మరింత మంచిది. కాఫీ ప్రేమికులు ఈ సూచనలు పాటిస్తే ఆరోగ్యానికి హాని లేకుండా కాఫీని ఆస్వాదించవచ్చు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *