థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు తప్పనిసరి!
ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం, భారతదేశంలో సుమారు 4.2 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ వ్యాధి.. ఇప్పుడు పిల్లలు, పురుషుల్లో కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే థైరాయిడ్ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని అంటున్నారు.ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం థైరాయిడ్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి.
హైపోథైరాయిడిజం
హైపర్ థైరాయిడిజం
ఈ రెండింటి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం
ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి:
పప్పులు, పనీర్, గుడ్లు, పెరుగు, చేపలు, చికెన్ వంటి ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి శక్తినిచ్చి అలసట తగ్గించడంలో సహాయపడతాయి.
సెలీనియం, జింక్ అవసరం:
గుమ్మడికాయ గింజలు, నట్స్, సముద్ర ఆహారం, తృణధాన్యాల్లో ఉండే సెలీనియం, జింక్ థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయడంలో ఉపయోగపడతాయి.
అయోడిన్ మితంగా తీసుకోవాలి:
అయోడిన్ శరీరానికి అవసరం. కానీ ఎక్కువగా తీసుకుంటే హానికరం కావచ్చు. అందుకే అయోడైజ్డ్ ఉప్పును మితంగా వాడాలి.
జంక్ ఫుడ్ తగ్గించాలి:
కూల్ డ్రింక్స్, ప్యాకెట్ స్నాక్స్, ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు, బాగా వేయించిన ఆహారాలు తినడం తగ్గించాలి. ఇవి బరువు పెరగడం, శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి కారణమవుతాయి.
పేగుల ఆరోగ్యాన్ని కాపాడాలి:
పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహారాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది థైరాయిడ్ నియంత్రణకు కూడా సహాయపడుతుంది. మందులతో పాటు సరైన ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం, క్రమం తప్పని థైరాయిడ్ పరీక్షలు కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
To get more interesting news, click the link below.
Thyroid Cases Increasing Rapidly in India: Experts Stress Early Awareness and Healthy Diet Choices

Recently, thyroid-related health issues have been increasing rapidly. According to reports, nearly 42 million people in India are suffering from thyroid disorders. Experts say that although the condition is more common in women, it is now also increasing among children and men. Therefore, creating awareness about thyroid health has become very important.
According to health experts, thyroid disorders are mainly of two types:
- Hypothyroidism
- Hyperthyroidism
The symptoms of these two conditions are different. If the early signs are ignored, the problem can become more serious over time.
Foods Recommended for People with Thyroid Problems
Eat Protein-Rich Foods
Foods such as pulses, paneer, eggs, curd, fish, and chicken are rich in protein. These help provide energy to the body and reduce fatigue.
Include Selenium and Zinc
Pumpkin seeds, nuts, seafood, and whole grains contain selenium and zinc, which help balance thyroid hormones.
Take Iodine in Moderation
Iodine is essential for the body, but consuming too much can be harmful. Therefore, iodized salt should be used in moderation.
Reduce Junk Food
Avoid or reduce cool drinks, packaged snacks, sugary foods, and deep-fried items. These can lead to weight gain and increase inflammation in the body.
Maintain Gut Health
Consuming curd, buttermilk, fermented foods, and fiber-rich foods improves digestion. Good gut health also supports better thyroid regulation.
Experts also emphasize that along with medication, maintaining a healthy diet, getting proper sleep, regular exercise, and routine thyroid check-ups are very important for managing thyroid disorders effectively.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

