CelebrityNewsPoliticsTrendyViral

జనసేన హౌస్‌మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

జన‌సేన హౌస్‌మోషన్ పిటిషన్‌‌ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ఇప్పటికిప్పుడు పిటిషన్‌ను విచారణ చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘వెకేషన్ బెంచ్‌లో మీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు’ అని చీఫ్ జస్టిస్ బెంచ్ పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు(మంగళవారం) గచ్చిబౌలిలో ‘తెలంగాణ నవ నిర్మాణ సభ’ పేరుతో జనసేనాని పవన్ కల్యాణ్ ఓ సభ పెట్టాలని నిర్ణయించారు. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ విషయంపై జనసేన పార్టీ.. హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే జనసేన పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది.పవన్ పోస్ట్…

జనసేన సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జూబ్లీహిల్స్ మాదాపూర్‌లోని తన నివాసంలో పవన్ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా ఎక్స్‌లో జనసేనాని చేసిన పోస్ట్.. సంచలనంగా మారింది. ‘ఈరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని నా ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తాను. మా నాయకులతో కలిసి నిర్వహించే ఈ ప్రెస్‌మీట్‌కు తెలంగాణ పోలీసు శాఖ అనుమతి ఇస్తుందా.. చూద్దాం’ అంటూ పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.

To get more interesting news, click the link below.

Telangana TV

Pawan Kalyan’s Jana Sena Faces Setback as HC Refuses Hearing

Telangana High Court Declines to Hear Jana Sena House Motion Petition

The Telangana High Court has declined to hear the House Motion Petition filed by the Jana Sena Party regarding permission for its proposed public meeting. The Chief Justice’s bench stated that the petition should be filed before the vacation bench and clarified that it could not take up the matter immediately.

Jana Sena chief Pawan Kalyan had planned to hold a public meeting titled “Telangana Nava Nirmana Sabha” at Gachibowli on Tuesday as part of Telangana Formation Day celebrations. However, the Telangana Police denied permission for the event, prompting the party to approach the High Court with a House Motion Petition. The court, however, refused to hear the plea.

Pawan Kalyan’s Post Goes Viral

Following the police denial of permission for the public meeting, Pawan Kalyan announced that he would instead hold a press conference in Hyderabad on Tuesday evening. The media interaction is scheduled to take place at his residence in Jubilee Hills and Madapur area, along with party leaders.

In a post on X (formerly Twitter), Pawan Kalyan wrote:

“I will hold a press conference at my residence in Jubilee Hills today between 4:30 PM and 5:30 PM along with our party leaders. Let us see whether the Telangana Police Department grants permission for this press meet.”

The post has quickly gained attention and sparked political discussion on social media.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *