తెలంగాణకు OG కేసీఆర్.. వేరే ఎవరూ అవసరం లేదు: కేటీఆర్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌ను గౌరవిస్తామని.. సోదరుడిగా ఇంటికి వస్తే.. హైదరాబాద్ బిర్యానీ పెడతామన్నారు. అంతే కానీ.. తమ సచివాలయంలో కూర్చుంటామంటే కుదరదన్నారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు OG కేసీఆర్ అని.. వేరే ఎవరూ అవసరం లేదన్నారు.పవన్ కళ్యాణ్.. మీరు ఇక్కడకి రండి.. మీ కుటుంబాలు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. ప్రాంతాలుగా విడిపోయినా.. ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో సమానమని పవన్ అన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర వేరు పడాలని పొట్టి శ్రీరాములు పోరాడారు. అది కూడా ప్రాంతీయవాదమే అంటారా? మోదీ తన ప్రాంతీయవాదంతో.. తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను తరలించుకుపోతున్నారు. జాతీయవాదం ముసుగులో ఆర్థిక పాంత్రీయవాదం చేయటం సరైందేనా? దీనికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్తారా’ అని కేటీఆర్ ప్రశ్నించారు.తెలంగాణలో జనసేన కొత్తగా చేసేదేముందని కేటీఆర్ అన్నారు. దేశభక్తి గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. 2023 ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిందని గుర్తుచేశారు. 2018లో చంద్రబాబు కూడా పోటీ చేశారని తెలిపారు. ‘పవన్.. తెలంగాణలో పోటీ చేయండి.. ఎవరు వద్దంటున్నారు. ఇక్కడకు వచ్చి అనాయాసంగా మాట్లాడటం సరికాదు. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కదం తొక్కిన నేల ఇది. ఆవిర్భావ దినోత్సవం రోజు విభజన తీరు సరిగా లేదని అంటున్నారు. తెలంగాణపై ఉల్టాపల్టా మాటలెందుకు? తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్ సభ పెడతానంటే ఎలా. పవన్ మీటింగ్‌ను అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం’ అని తెలిపారు. వందల మంది బలిదానాల రక్తంతో తడిసిన నేల తెలంగాణ అని మాజీ మంత్రి అన్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పవన్ మాట్లాడాలని హితవుపలికారు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చని తెలిపారు. ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు.పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ సాకారమైందని కేటీఆర్ అన్నారు.1956లో బలవంతంగా ఆంధ్ర, తెలంగాణను కలిపింది కాంగ్రెస్ అని విమర్శించారు.1969 ఉద్యమంలో 379 మంది ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్సే అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాలను కర్కశంగా అణిచివేసింది కాంగ్రెస్ అని విరుచుకుపడ్డారు. మలిదశ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్సే అని అన్నారు. తెలంగాణ కథలో నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని.. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పోరాటం, దీక్ష లేకపోతే.. తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్ హయాంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదని మాజీ మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. అమలుకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిందేంటి అని ప్రశ్నించారు. అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డ్ సృష్టిస్తోందని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ ప్రభుత్వం రూ.4లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. అప్పులపై ఒక్కో మంత్రి.. ఒక్కో లెక్క చెబుతున్నారన్నారు. కరోనా కంటే కాంగ్రెస్ ప్రమాదమని ప్రజలకు అర్థమైందని కేటీఆర్ పేర్కొన్నారు.
To get more interesting news, click the link below.

KTR Gives Strong Counter to Pawan Kalyan Over Telangana Remarks
BRS Working President K. T. Rama Rao (KTR) strongly responded to Andhra Pradesh Deputy Chief Minister and Jana Sena Party chief Pawan Kalyan, asserting that Telangana belongs to its people and does not require anyone else’s validation.
Speaking to the media at the Somajiguda Press Club on Wednesday, KTR said Telangana is the legacy of its people and that former Chief Minister K. Chandrashekar Rao (KCR) remains the “OG” leader of Telangana. He remarked that while Pawan Kalyan is respected as Andhra Pradesh’s Deputy CM and would be welcomed as a guest in Hyderabad, it would not be acceptable for outsiders to claim authority over Telangana’s affairs.
KTR questioned Pawan Kalyan’s criticism of regionalism, pointing out that the movement led by Potti Sriramulu for a separate Andhra state was also rooted in regional aspirations. He further alleged that Prime Minister Narendra Modi is encouraging “economic regionalism” by shifting industries away from Telangana and asked whether Pawan would respond to such concerns.
He stated that Jana Sena has already contested elections in Telangana and is free to do so again, but advised Pawan Kalyan to understand the sentiments of Telangana’s people before making remarks about the state. KTR emphasized that Telangana was achieved through decades of struggle, sacrifices, and public movements.
Targeting the Congress party, KTR accused it of being responsible for the historical injustices faced by Telangana. He claimed Congress forcibly merged Andhra and Telangana in 1956, suppressed the 1969 Telangana movement, and only granted statehood under unavoidable circumstances. According to KTR, Telangana would not have been achieved without KCR’s leadership and fast-unto-death protest.
KTR also defended the development achieved during the BRS government, stating that no other state had witnessed comparable progress. He challenged both Congress and BJP to prove otherwise and said he would quit politics if they succeeded. Criticizing the current government led by Anumula Revanth Reddy, KTR alleged that it came to power on unfulfilled promises and has accumulated massive debt in a short period.
He concluded by urging Pawan Kalyan to think carefully before making statements about Telangana, stressing that anyone can contest elections anywhere in India, but leaders must respect local sentiments and historical realities.
