ప్రెగ్నెన్సీలో ఒత్తిడి.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందా?

గర్భధారణ సమయంలో చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, ఎక్కువగా ఒత్తిడికి గురవడం చాలా మంది మహిళల్లో కనిపించే సాధారణ సమస్య. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు వేగంగా జరుగుతాయి. వాటి ప్రభావంతో భావోద్వేగాల్లో మార్పులు, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు రావచ్చు.అయితే గర్భధారణ సమయంలో దీర్ఘకాలంగా ఒత్తిడికి గురికావడం తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ అభివృద్ధిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లి శరీరంలో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ల స్థాయులు పెరిగితే, అది శిశువు మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ప్రభావం ఎలా ఉంటుంది?
ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం, గర్భధారణ సమయంలో తల్లి నిరంతరం ఒత్తిడికి గురైతే, అది పిల్లల భావోద్వేగ వికాసం, ప్రవర్తన, ఏకాగ్రత సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొంతమంది పిల్లల్లో చిరాకు, ఆందోళన లేదా ఏకాగ్రత లోపం వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే ఈ ప్రభావాలు ప్రతి గర్భిణీలో ఒకేలా ఉంటాయని చెప్పలేమని, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి వంటి అంశాలపై అవి ఆధారపడి ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
ఎప్పుడూ ఆందోళన లేదా భయంతో ఉండటం.
తరచూ కోపం రావడం, చిరాకుగా అనిపించడం.
నిద్ర సరిగా లేకపోవడం.
ఎక్కువగా బాధగా లేదా ఒంటరిగా అనిపించడం.
రోజువారీ పనులపై ఆసక్తి తగ్గిపోవడం.
ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులని లేదా మానసిక ఆరోగ్య నిపుణులని సంప్రదించడం మంచిది.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి సూచనలు
రోజు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి మానసిక మద్దతు పొందాలి.
వైద్యుల సూచన మేరకు తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
సమతుల్య ఆహారం తీసుకోవాలి.
అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.
గర్భధారణ సమయంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. తల్లి ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఎదుగుదల కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది.
To get more interesting news, click the link below.
The Impact of Pregnancy Stress on Mother and Baby Health

Stress During Pregnancy: Why It Shouldn’t Be Ignored
Getting angry over small things or feeling stressed more often is a common experience for many women during pregnancy. During this period, the body undergoes rapid hormonal changes, which can lead to mood swings, anxiety, irritability, and emotional ups and downs.
However, health experts say that prolonged stress during pregnancy may affect not only the mother’s health but also the development of the unborn baby. Some studies suggest that increased levels of stress-related hormones in the mother’s body could influence the baby’s brain development.
How Can Stress Affect the Baby?
According to health professionals, if a pregnant woman experiences continuous stress, it may impact a child’s emotional development, behavior, and ability to concentrate later in life. Some children may show signs of irritability, anxiety, or attention difficulties. However, doctors emphasize that these effects do not occur in every pregnancy and can vary depending on individual health conditions, lifestyle, and other factors.
Symptoms You Should Not Ignore
- Constant feelings of anxiety or fear.
- Frequent anger or irritability.
- Difficulty sleeping or poor sleep quality.
- Feeling sad, lonely, or emotionally overwhelmed.
- Loss of interest in daily activities.
If these symptoms continue for an extended period, it is advisable to consult a doctor or mental health professional.
Tips to Reduce Stress During Pregnancy
- Get adequate rest every day.
- Talk to family members and friends for emotional support.
- Engage in light exercises as recommended by your doctor.
- Follow a balanced and nutritious diet.
- Seek medical advice whenever necessary.
Take Care of Your Mental Health
During pregnancy, paying attention to mental health is just as important as caring for physical health. When a mother remains calm, healthy, and emotionally supported, it can contribute positively to both her well-being and the baby’s overall development.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates
