మందులు వాడేటప్పుడు ఈ 3 తప్పులు చేయొద్దు..
మందులు తీసుకునేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపవచ్చు. అనారోగ్యం తగ్గించడానికి మందులు ఎంత ముఖ్యమో, వాటిని సరైన విధంగా తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి వ్యాధిని మరింత పెంచే ప్రమాదం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం
జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు చాలామంది స్వయంగా మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేసి వాడేస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఇలా చేయడం ప్రమాదకరం. దీనివల్ల శరీరంపై దుష్ప్రభావాలు కలగవచ్చు.
మందుల కోర్సు మధ్యలోనే ఆపేయడం
కొంతమందికి ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడగానే యాంటీబయాటిక్ మందులు ఆపేస్తారు. దీంతో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకుండా మళ్లీ తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
సమయానికి మందులు తీసుకోకపోవడం
కొంతమంది మందులు ఖాళీ కడుపుతో తీసుకుంటారు లేదా డాక్టర్ చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వాడుతారు. అలాగే గడువు ముగిసిన మందులు వాడటం కూడా ప్రమాదకరం.
అధికంగా వాడటం ప్రమాదకరం
పెయిన్‌కిల్లర్స్‌ను ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాలు, కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో కిడ్నీ, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
జెనరిక్, బ్రాండెడ్ మందుల మధ్య తేడా
జెనరిక్, బ్రాండెడ్ మందుల్లో ఉండే ఔషధ పదార్థం ఒకటే. వీటి మధ్య తేడా ప్రధానంగా కంపెనీ పేరు, ధరలో మాత్రమే ఉంటుంది. డాక్టర్ సూచనల మేరకు సరైన విధంగా వాడితే జెనరిక్ మందులు కూడా బ్రాండెడ్ మందుల్లాగే ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
To get more interesting news, click the link below.
Common Medication Mistakes That Can Put Your Health at Risk

Common Mistakes People Make While Taking Medicines
Even small mistakes while taking medicines can have a significant impact on your health. Just as medicines are important for treating illnesses, taking them correctly is equally essential. However, many people unknowingly make errors that can worsen their condition, according to health experts.
Taking Medicines Without a Doctor’s Advice
When they experience fever, cough, or a cold, many people buy medicines directly from a pharmacy and start using them without consulting a doctor. This can be especially risky for children, as inappropriate medication may cause harmful side effects and other health complications.
Stopping the Medication Course Too Early
Some people stop taking antibiotics as soon as they start feeling better. However, this can prevent the infection from being completely cured, increasing the risk of it returning in a more severe form.
Not Taking Medicines on Time
Many people take medicines on an empty stomach when they should be taken after food, or they fail to follow the schedule recommended by their doctor. Using expired medicines can also be dangerous and may reduce treatment effectiveness.
Overusing Medicines Can Be Harmful
Health experts warn that excessive use of painkillers can seriously affect the kidneys and liver. Long-term overuse may increase the risk of developing kidney disease and liver-related health problems.
Difference Between Generic and Branded Medicines
Generic and branded medicines contain the same active ingredients. The main differences are usually the company name and the price. According to health experts, generic medicines can be just as effective as branded medicines when used correctly and as prescribed by a doctor.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates

