Celebrity

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ లో ఉద్యోగం చేసే సువర్ణ ఆవకాశం..

ఓఎన్‌జీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ. ఆసియాలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన దీన్ని 1956 ఆగస్టు 14న స్థాపించారు.ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లేదా ఓఎన్‌జీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీ కూడా. భారతదేశ ముడి చమురు ఉత్పత్తిలో 77 శాతం, సహజవాయువు ఉత్పత్తిలో 81 శాతం ఈ కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్నదే.ఓఎన్జీసీలో కొలువుల జాతర మొదలైంది. 5655 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పోస్టులు ఉండనున్నాయి. ఇందులో రాజమండ్రిలో 385 పోస్టులు, కాకినాడలో 104 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్, లైబ్రరరీ, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఇలా పలు విభాగాలకు ఉద్యోగులను ఎంపికచేయనున్నారు. ఇంటర్, ఐటీ, బీకాం, బీఎస్సీ అభ్యర్థులు దీనికి అర్హులు. దరఖాస్తుకు వచ్చే నెల 3 చివరితేదీగా తెలిపింది. వివిధ ప్రాంతాల వారిగా ఉద్యోగాల మరియు నోటిఫికేషన్ వివరాలు

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *