6వ తరగతి నుంచే త్రిభాషా సూత్రం తప్పనిసరి: NEP-2020కు అనుగుణంగా సీబీఎస్ఈ కీలక నిర్ణయం
దేశంలో త్రిభాషా సూత్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జాతీయ విద్యా విధానం (NEP-2020) మార్గదర్శకాలకు అనుగుణంగా 6వ తరగతి నుంచే మూడో భాషను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్ణయించింది. ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయి.
కొత్త నిబంధనలు ఎలా ఉంటాయి?
సవరించిన మార్గదర్శకాల ప్రకారం 6వ తరగతి విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలి. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు తప్పనిసరి. ఇంగ్లీష్‌ను ప్రాంతీయ భాషగా బోధిస్తున్న ప్రాంతాల్లో దానిని విదేశీ భాషగా పరిగణిస్తారు. అంటే ఇంగ్లీష్ మాధ్యమం ఉన్న ప్రాంతాల్లో విద్యార్థులు అదనంగా రెండు భారతీయ భాషలను ఎంపిక చేసుకోవాలి.
ఒకవేళ విద్యార్థి ఫ్రెంచ్, స్పానిష్ వంటి విదేశీ భాషను ఎంచుకున్నా, మొత్తం మూడు భాషల్లో రెండు దేశీయ భాషలు తప్పనిసరిగా ఉండాలి. స్థానిక అవసరాలు, ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని ఏ భాషలను అందించాలన్నది రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చు.
NEP-2020 ప్రకారం కనీసం 5వ తరగతి వరకు — అవసరమైతే 8వ తరగతి లేదా అంతకంటే పై తరగతుల వరకు — మాతృభాష, ఇంటి భాష లేదా ప్రాంతీయ భాషను బోధనా మాధ్యమంగా కొనసాగించాలని సూచించింది. 2023 జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం ప్రకారం 9, 10 తరగతుల వరకు విద్యార్థులు మూడు భాషల్లో నైపుణ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
త్రిభాషా సూత్రం – నేపథ్యం
త్రిభాషా సూత్రాన్ని మొదటిసారి 1968 జాతీయ విద్యా విధానంలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1986 విద్యా విధానం, తాజా NEP-2020లో కూడా దీనిని ప్రస్తావించారు. అయితే ఇది చట్టబద్ధమైన బలవంతపు నిబంధన కాదని, రాష్ట్రాలకు మార్గదర్శకంగా మాత్రమే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఎవరిపైనా ఏ భాషనూ రుద్దబోమని తెలిపింది.
1968లో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఈ సూత్రాన్ని అమలు చేశారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో — హిందీ, ఆంగ్లం, ఒక ఆధునిక భారతీయ భాష (ప్రధానంగా దక్షిణ భారత భాష); హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో — హిందీ, ఆంగ్లం, ప్రాంతీయ భాష ఉండాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన నిరసనల నేపథ్యంలో ఈ రూపకల్పన జరిగింది. ప్రస్తుతం తమిళనాడులో ఈ త్రిభాషా సూత్రాన్ని అనుసరించడం లేదు.
జాతీయ సమైక్యతను కాపాడుతూ బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యంగా కేంద్రం వెల్లడించింది.
To get more interesting news, click the link below.
Three-Language Formula Mandatory from Class 6: Key CBSE Decision Under NEP 2020
In a significant move aligned with the New Education Policy (NEP) 2020, the Central Board of Secondary Education (CBSE) has decided to implement the Three Language Formula from Class 6 in its schools. The decision aims to strengthen language learning among students and help them understand India’s diverse cultures and languages.
According to the latest CBSE education policy updates, the implementation of the three language formula mandatory from class 6 CBSE is part of the broader reforms introduced under NEP 2020. The policy focuses on improving language proficiency while encouraging students to appreciate linguistic diversity across the country.
What is the Three Language Formula?
Many parents and students often ask, what is the three language formula in education. The three language system in Indian schools is designed to ensure that students learn three different languages during their schooling. Generally, the formula includes:
- The mother tongue or regional language
- Hindi or another Indian language
- English or another language
This system allows students to develop strong communication skills while also gaining exposure to different cultures and traditions within India.
NEP 2020 Language Policy in Schools
The NEP 2020 language policy explained emphasizes the importance of learning in the mother tongue or regional language, especially during the early years of education. Experts believe that students understand concepts better when taught in their native language.
As part of these reforms, CBSE implementing three language formula from class 6 ensures that students gradually develop multilingual abilities while continuing their academic studies.
How the Three Language Formula Works in Schools
Many people are curious about how the three language formula works in schools. Under this system, students study three languages as part of their curriculum. However, the exact choice of languages may vary depending on the school, region, and state education policies.
Schools are expected to provide flexibility while ensuring students receive proper language education. This approach also helps students gain practical communication skills that can benefit them in higher education and careers.
Implementation in Telangana
The policy will also apply to CBSE schools in Telangana, including several Hyderabad CBSE schools. As discussions continue about NEP 2020 implementation in Telangana, education experts believe the policy will enhance multilingual learning among students.
In cities like Hyderabad, where students come from diverse linguistic backgrounds, the education policy in Telangana and new CBSE guidelines are expected to support better language learning opportunities.
Benefits for Students
The new education policy language rule for students aims to help learners become more adaptable and culturally aware. Through the three language formula in education, students can develop better communication skills and broaden their understanding of different regions of India.
Overall, the changes in the new education policy India reflect a long-term vision to strengthen the education system. With the implementation of the three-language formula, school education in Hyderabad and across the country is expected to promote multilingual learning and prepare students for a more connected and diverse future.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

