News

ఐపీఎల్ 2026 ఘోర ఓటమిలోనూ రాజస్థాన్ రాయల్స్ అరుదైన రికార్డు!

ఐపీఎల్ 2026లో మరో సంచలన మ్యాచ్ చోటుచేసుకుంది. Indian Premier League 2026 సీజన్‌లో జరిగిన ఈ కీలక పోరులో Rajasthan Royals జట్టు, Sunrisers Hyderabad చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఈ ఓటమి మధ్య కూడా రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించడం విశేషం.

రాజస్థాన్ రాయల్స్ చారిత్రాత్మక రికార్డు

ఐపీఎల్ చరిత్రలో మొదటి 5 వికెట్లు 20 పరుగుల లోపే కోల్పోయిన తర్వాత కూడా 150 పరుగుల మార్క్ దాటిన తొలి జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర సంక్షోభంలో పడిన రాజస్థాన్… ఐపీఎల్ లోనే అత్యల్ప స్కోర్ (49 పరుగులు – బెంగళూరు) రికార్డును బద్దలు కొడుతుందేమో అనిపించింది.

కానీ మధ్యలో జడేజా, ఫెరియెరా పోరాటం జట్టును నిలబెట్టింది. వారి కీలక ఇన్నింగ్స్‌లతో రాజస్థాన్ రాయల్స్ 159 పరుగుల వరకు చేరుకుని, ఓటమిలోనూ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 20 పరుగుల లోపు 5 వికెట్లు కోల్పోయిన ఏ జట్టు కూడా 150 పరుగుల మార్క్ చేరలేదు. ఈ రికార్డు ఇప్పుడు రాజస్థాన్ పేరిట నమోదు అయింది.

మ్యాచ్ హైలైట్స్ – IPL 2026 మ్యాచ్ రిపోర్ట్

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన Sunrisers Hyderabad జట్టు… స్టార్ బ్యాట్స్‌మన్ Ishan Kishan అద్భుత ఇన్నింగ్స్‌తో 91 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అలాగే క్లాసెన్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (28), సలీల్ అరోరా (24 నాటౌట్) కీలకంగా రాణించారు. దీంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగులు చేసింది.

217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన Rajasthan Royals జట్టు… ఆరంభంలోనే కుప్పకూలింది. అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే (4 వికెట్లు), సకిబ్ హుస్సేన్ (4 వికెట్లు) అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు. చివరికి రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయి మ్యాచ్‌ను కోల్పోయింది.

To get more interesting news, click the link below.

Telangana TV

IPL 2026 Rajasthan Royals Script Record Despite Loss to SRH

RR collapse but create record in IPL 2026 vs SRH defeat match

In one of the most dramatic games of the Indian Premier League 2026 season, Rajasthan Royals suffered a crushing 57-run defeat against Sunrisers Hyderabad. However, despite the heavy loss, Rajasthan Royals etched their name in the record books with a remarkable and rare achievement in IPL history.

Rajasthan Royals’ Historic Record in IPL 2026

Chasing a massive 217-run target in this high-scoring IPL 2026 match, Rajasthan Royals had a nightmare start. The team collapsed to just 9 runs for the loss of 5 wickets, putting them on the verge of registering one of the lowest totals in IPL history. At that stage, many believed they might even break the unwanted record of the lowest IPL score (49 runs by RCB).

But in a stunning turnaround, a resilient partnership between Jadeja and Ferreira helped stabilize the innings. The duo showed great composure under pressure and stitched together a fighting stand, guiding the team past the 150-run mark.

With this effort, Rajasthan Royals became the first team in IPL history to cross 150 runs after losing their first five wickets for under 20 runs—a rare and historic milestone in IPL 2026 highlights. Even in defeat, this Rajasthan Royals IPL record became one of the biggest talking points in IPL 2026 news.

Sunrisers Hyderabad’s Dominant Batting Display

Earlier in the match, Sunrisers Hyderabad delivered a commanding batting performance after being put in to bat. Star wicketkeeper-batter Ishan Kishan played a sensational knock of 91 runs, anchoring the innings and setting the tone for a big total.

He was well supported by Heinrich Klaasen, who contributed a steady 40 runs. In the final overs, Nitish Kumar Reddy (28) and Salil Arora (24 not out) provided the late acceleration, powering Sunrisers Hyderabad to an imposing total of 216/6 in 20 overs. This strong batting display made it one of the most exciting IPL 2026 high-scoring matches.

Debut Pacers Turn the Game Around

The real game-changers of this IPL 2026 match report were the debutant pacers Prafull Hingey and Sakib Hussain. Both bowlers delivered exceptional performances, picking up 4 wickets each and dismantling Rajasthan Royals’ top order within the powerplay.

Their fiery spells ensured that Rajasthan Royals never fully recovered from the early collapse. The duo’s performance is now being hailed as one of the best debut bowling efforts in IPL 2026 highlights.

Match Summary – IPL 2026 RR vs SRH

  • Sunrisers Hyderabad: 216/6 (20 overs)
  • Rajasthan Royals: 159 all out (19 overs)
  • Result: Sunrisers Hyderabad won by 57 runs

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *