కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు..
గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని అర్చకుల నుంచి వివరాలు సేకరించారు. దేవస్థానం నిర్వహణ ట్రస్ట్ కార్యాలయానికి తాళాలు తెరిపించి రికార్డులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. ట్రస్ట్ బోర్డులోని 31 మంది సభ్యులు ఎవరూ అందుబాటులో లేమంటూ ఫోన్లో సమాధానం చెప్పడంతో ఏసీ లలిత విస్మయం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవడం ఏంటని ట్రస్ట్ సభ్యులపై లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు.దాత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏసీ లలిత.. పూర్తి వివరాలు సేకరించారు. దేవాదాయ శాఖ కమిటీ పరిధిలో ట్రస్ట్ లేకపోవడంతో చర్యలు తీసుకోలేకపోతున్నామని స్పష్టం చేశారు. రికార్డులు పరిశీలించిన తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమని వెల్లడించారు. బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంలో ట్రస్ట్ కమిటీ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విచారణ ముమ్మరం చేశారు. మధ్యాహ్నంలోపు విచారణ నివేదిక అందించాల్సి ఉండటంతో ఏసీ లలిత ఆలయంలోనే వేచి ఉన్నారు. ఈ వ్యవహారంలో తాకట్టు కొట్టు వ్యాపారి పరారీలో ఉన్నాడు. తన ఖాతాకు తాకట్టు డబ్బులు జమ చేస్తేనే ఊరికి వస్తానని ట్రస్ట్ బోర్డుకు తాకట్టు వ్యాపారి సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
ట్రస్ట్ సభ్యులకు యలవర్తి శ్రీనివాసరావు హెచ్చరిక
విచారణ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆలయానికి చేరుకున్నారు. దేవస్థాన ట్రస్ట్ బోర్డు చేసిన తప్పిదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల గుడివాడకు చెడ్డపేరు వస్తోందని కమిటీ సభ్యులకు ఫోన్ చేసి చెప్పానని తెలిపారు. కిరీటాన్ని స్వామివారికి అలంకరించాలని భక్తుల తరఫున డిమాండ్ చేశారు. కమిటీ సభ్యులు స్పందించకపోవడంతో కిరీటం అలంకరించే వరకు ఆలయంలోనే కూర్చుంటానని యలవర్తి స్పష్టం చేశారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న బంగారు వ్యాపారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవుడి విషయంలో జరిగిన అపచారం భక్తులను కలచివేసిందని, దీనిపై ఉన్నత స్థాయికి వెళ్తానని హెచ్చరించారు. సాయంత్రంలోపు కిరీటం అలంకరించకపోతే భక్తులతో కలిసి యాక్షన్ ప్లాన్‌లో దిగుతామని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదని యలవర్తి శ్రీనివాసరావు హెచ్చరిక జారీ చేశారు.
To get more interesting news, click the link below.
Gudivada Temple Gold Crown Missing, Probe Intensifies

An inquiry has been launched by the Endowments Department into the disappearance of a gold crown worth nearly ₹1 crore from the famous Sri Kalyana Venkateswara Swamy Temple in Gudivada. Endowments Department Assistant Commissioner Lalitha rushed to the temple and collected details from the priests. She reportedly asked for the trust office records to be opened and submitted for inspection.
However, all 31 members of the temple trust board reportedly informed her over phone that they were unavailable. AC Lalitha expressed shock and anger over the members not being present despite prior intimation. She also interacted with the donor’s family members and gathered complete information regarding the missing crown.
Officials clarified that since the trust does not fall directly under the Endowments Department committee, immediate action could not be initiated. They stated that conclusions can only be drawn after examining the records thoroughly. Suspicion is reportedly growing over the role of trust committee members in the alleged pledging of the gold crown, leading authorities to intensify the investigation. Lalitha remained at the temple awaiting further records as the inquiry report had to be submitted by afternoon.
Meanwhile, the gold trader allegedly involved in the pledge transaction is said to be absconding. Reports suggest that he informed the trust board that he would return to the town only after the pledged amount was deposited into his account.
Yalavarthi Srinivasa Rao Warns Trust Members
During the ongoing investigation, Yalavarthi Srinivasa Rao visited the temple and expressed strong anger over the negligence of the temple trust board. He said the incident was bringing a bad name to Gudivada and claimed he had already warned committee members over the phone.
Speaking on behalf of devotees, he demanded that the gold crown be immediately restored and adorned to the deity. Since committee members failed to respond, he announced that he would remain at the temple until the crown was returned to the idol. He also demanded strict action against the gold trader involved in the pledge issue.
Srinivasa Rao said the insult caused in the name of God had deeply hurt devotees’ sentiments and warned that he would escalate the matter to higher authorities. He further stated that if the crown was not restored by evening, devotees would launch an action plan protest. He warned that playing with the emotions of devotees would not be tolerated.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates

