Health

గ్యాస్ సమస్యతో ఇబ్బందా..? వాము, సోంపుతో సింపుల్ ట్రీట్మెంట్

ప్రస్తుత జీవనశైలిలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, సమయానికి భోజనం చేయకపోవడం, అధిక ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న కడుపు సమస్యలకు ప్రతిరోజూ మందులు తీసుకోవడం కంటే, కొన్ని సహజమైన ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.వాము – నల్ల ఉప్పు

వాము జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. అర టీస్పూన్ వాములో కొద్దిగా నల్ల ఉప్పు కలిపి గోరువెచ్చని నీటితో తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి. భోజనం తర్వాత తీసుకుంటే ఇంకా మంచిది.

సోంపు నీరు

సోంపు.. జీర్ణక్రియను సులభం చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు వేసి మరిగించి తాగితే గ్యాస్, గుండెల్లో మంట, కడుపు బరువుగా అనిపించడం తగ్గుతాయి.

అల్లం – నిమ్మరసం

అల్లం జీర్ణక్రియను వేగంగా జరిగేలా చేస్తుంది. చిన్న అల్లం ముక్కకు కొద్దిగా నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి తింటే గ్యాస్, అజీర్ణం తగ్గుతాయి. భోజనం ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇంగువ

ఇంగువను గ్యాస్ సమస్యలకు మంచి మందుగా ఆయుర్వేదం చెబుతుంది. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే కడుపులో గ్యాస్ తగ్గుతుంది. పప్పులు, కూరల్లో కూడా ఇంగువ వాడితే జీర్ణం సులభంగా జరుగుతుంది.

తిన్న వెంటనే పడుకోకండి

భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు పెరుగుతాయి. తిన్న తర్వాత కనీసం 10–15 నిమిషాలు నెమ్మదిగా నడిస్తే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. రాత్రి భోజనం కూడా తేలికగా, సమయానికి చేయడం మంచిది. గ్యాస్ సమస్య తరచుగా వస్తూ ఉంటే లేదా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే వైద్యులని సంప్రదించడం మంచిది.

To get more interesting news, click the link below.

Telangana TV

Natural Ayurvedic Tips for Gas and Indigestion Relief

In today’s lifestyle, many people suffer from gas, indigestion, bloating, and stomach discomfort due to eating excessive junk food, irregular meal timings, and high stress levels. Health experts suggest that instead of taking medicines daily for minor stomach problems, following a few natural Ayurvedic remedies may provide relief.

Ajwain (Carom Seeds) & Black Salt

Ajwain helps improve digestion effectively. Mixing half a teaspoon of ajwain with a little black salt and consuming it with lukewarm water can reduce gas, indigestion, and stomach pain. It works even better when taken after meals.

Fennel Water

Fennel seeds help make digestion easier. Boiling one teaspoon of fennel seeds in a glass of water and drinking it can relieve gas, acidity, and heaviness in the stomach.

Ginger & Lemon Juice

Ginger helps speed up digestion naturally. Eating a small piece of ginger mixed with lemon juice and a pinch of black salt can reduce gas and indigestion. Taking it before meals gives better results.

Asafoetida (Hing)

Ayurveda considers asafoetida a powerful remedy for gas-related problems. Mixing a pinch of hing in lukewarm water and drinking it can help reduce stomach gas. Adding hing while cooking dals and curries also supports easy digestion.

Don’t Lie Down Immediately After Eating

Lying down right after meals can worsen gas and indigestion. Walking slowly for at least 10–15 minutes after eating helps food digest properly. It is also better to have a light dinner on time.

If gas problems occur frequently or are accompanied by severe stomach pain, vomiting, or constipation, it is advisable to consult a doctor.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *