NewsPoliticspublicTrendyUseful

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరుకు సిద్ధమైన బీజేపీ..

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా జూన్ నెలంతా వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమైంది. ఈ మేరకు నేడు (ఆదివారం) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. తొలుత గోదావరి, కృష్ణా నదీ జలాలు, ప్రాజెక్టులు, నీటి పారుదల రంగంపై నేతలు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయా అంశాలపై టీవీ డిబేట్స్, ఇతర వేదికలపై మాట్లాడేలా నేతలకు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంచందర్ రావు హాజరుకాగా.. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం రాంచందర్ రావు అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ తివారి, పదాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకి అండగా నిలిచేందుకు మరో పోరుబాటకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది.

ఈ సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యాక్షన్ ప్లాన్ గురించి చర్చించారు. ఇటీవల ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పోరుబాటతో ప్రభుత్వం దిగొచ్చిందని, దీంతో తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని రాంచందర్ రావు అన్నారు. అలాగే విద్యార్థుల సమస్యలపైనా గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. నేతలంతా ఐక్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

To get more interesting news, click the link below.

Telangana TV

BJP Telangana Marks 12 Years of Modi Government with Statewide Outreach

BJP Prepares Awareness Campaign as PM Modi Completes 12 Years in Office

Twelve years of Prime Minister Narendra Modi’s governance have been completed. To mark the occasion, the BJP has planned a series of discussion and awareness programs throughout June on various subjects.

As part of this initiative, discussions on multiple issues were held today (Sunday) at the BJP state office under the leadership of Telangana BJP President N. Ramchander Rao. The first session focused on the waters of the Godavari and Krishna rivers, irrigation projects, and the water resources sector.

During the meeting, Ramchander Rao instructed party leaders to effectively present these topics in television debates and other public forums. The special awareness program was attended by retired Chief Engineer Shyam Prasad Reddy, BJP state spokespersons, and media panelists.

Following this session, a meeting of BJP office-bearers commenced under the chairmanship of Ramchander Rao. The meeting was attended by BJP Telangana affairs in-charge Abhay Patil, organizational in-charge Chandrasekhar Tiwari, and other party leaders.

During the discussions, the BJP state leadership decided to launch another phase of agitation in support of students. Leaders deliberated on an action plan to pressure the Congress government to release pending fee reimbursement dues.

Ramchander Rao stated that the recent “Rythu Gosa – BJP Bharosa” campaign compelled the government to respond and that the people of Telangana are increasingly looking toward the BJP. He also called upon party leaders to strongly fight for students’ issues and urged everyone to work unitedly toward strengthening the party.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *