ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం… ఆర్మీ చీఫ్ ద్వివేది

పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) గట్టి హెచ్చరిక చేశారు. అవసరమైతే ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత సైనిక బలగాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. భూమి, ఆకాశం, సముద్రంలో అత్యాధునిక రీతుల్లో పోరాటానికి త్రివిద దళాలు సామర్థ్యం పెంచుకుంటున్నట్టు తెలిపారు. పుణెలో శనివారంనాడు జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ 150వ పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శాంతి తాత్కాలికమేనని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ సెకెండ్ ఫేజ్‌కు కూడా త్రివిధ దళాలు పట్టుదలగా సర్వసన్నద్ధమవుతున్నాయని అన్నారు.భవిష్యత్తులో జరుగబోయే యుద్ధాలు కేవలం భూమి, సుముద్రం, ఆకాశానికే పరిమితం కావని ద్వివేది అన్నారు. స్పేస్, సైబర్, కాగ్నిటివ్ డొమెయిన్లలోనూ యుద్ధ ప్రభావం ఉంటుందన్నారు. మోహరింపులు, ప్రొటక్షన్ చర్యలపై మిలటరీ వ్యూహకర్తలు అత్యంత అప్రత్తంగా ఉండాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ తన సత్తా చాటిందని, సైనకదళాలు కచ్చితత్వంలో దాడి చేయగలవని నిరూపించాయని చెప్పారు. భవిష్యత్ యుద్ధాల విషయంలోనూ ప్రజావిశ్వాసం, జాతీయ సమక్యత కీలకాంశాలుగా ఉంటాయన్నారు.
గత దశాబ్ద కాలంగా బలగాల సామర్థ్యంలో అద్భుతమైన పరివర్తన చోటుచేసుకుంటోందని, ఇందులో యువత భాగస్వామ్యం కీలకంగా ఉందని అన్నారు. ఈ మార్పుల్లో భాగంగా డ్రోన్ బెటాలియన్లు, దివ్యాస్త్ర బ్యాటరీలు, శక్తిమాన్ రెజిమెంట్లు, భైరవ్ బెటాలియన్లు, ఇతర టెక్నాలజీ ఆధారిత సైన్యాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. నెట్‌వర్గింగ్, డాటా-సెంట్రిసిటీ కీలకమైన వ్యూహాత్మక వనరులు కాబోతోందని అన్నారు. డ్రోన్ల వినియోగంపై అన్ని అకాడమీల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
To get more interesting news, click the link below.
Indian Armed Forces Fully Prepared for Operation Sindoor 2.0

Pakistan Warned by Indian Army Chief General Upendra Dwivedi
Indian Army Chief Upendra Dwivedi issued a strong warning to Pakistan, stating that the Indian Armed Forces are fully prepared for “Operation Sindoor 2.0” if the need arises. He said that the Army, Navy, and Air Force are continuously enhancing their capabilities to fight using advanced technologies across land, air, and sea.
Speaking to the media after the 150th Passing Out Parade at the National Defence Academy in Pune on Saturday, General Dwivedi said that peace is temporary and that the three services remain determined and fully ready for a second phase of Operation Sindoor if required.
He emphasized that future wars will not be limited to land, sea, and air. Instead, they will increasingly involve space, cyber, and cognitive domains, making it essential for military planners to remain highly alert regarding deployments and protection measures.
General Dwivedi stated that Operation Sindoor demonstrated India’s military strength and proved that its armed forces can conduct precise and effective strikes. He added that public confidence and national unity will be crucial factors in any future conflict.
Highlighting the transformation of India’s military over the past decade, he said that young personnel have played a vital role in this modernization. As part of these reforms, the armed forces are developing drone battalions, Divyastra batteries, Shaktimaan regiments, Bhairav battalions, and other technology-driven military units.
He further noted that networking and data-centric warfare will become key strategic assets in the future. To support this transition, training in drone operations is now being provided across all military academies.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates
