వేసవిలో ఓఆర్ఎస్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరమా?
వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలామంది డీహైడ్రేషన్ నుంచి రక్షణ కోసం ఓఆర్ఎస్ తాగుతారు. కొంతమంది అయితే రోజంతా ఓఆర్ఎస్ కలిపిన నీటినే తాగడం అలవాటుగా మార్చుకుంటారు. అయితే, అవసరానికి మించి ఓఆర్ఎస్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారుఓఆర్ఎస్‌లో సోడియం, పొటాషియం, గ్లూకోజ్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, లవణాల లోపం వచ్చినప్పుడు వాటిని సమతుల్యం చేసి డీహైడ్రేషన్ నుంచి త్వరగా కోలుకోవడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఎక్కువగా చెమట పట్టినప్పుడు లేదా డీహైడ్రేషన్ వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
ఓఆర్ఎస్ ఎవరికి ఉపయోగపడుతుంది?
ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారికి
పొలం పనులు చేసే వారికి
పిల్లలు, వృద్ధులకు
డయేరియా వచ్చినప్పుడు
ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ సూచన మేరకు ఓఆర్ఎస్ తీసుకోవడం మంచిది.
ఎక్కువగా తాగితే ఏమవుతుంది?
ఓఆర్ఎస్‌లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని తరచుగా తాగితే కొన్ని సమస్యలు రావచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.
బీపీ ఉన్నవారికి ఇబ్బంది కలగవచ్చు.
శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినవచ్చు.
మూత్రపిండాలపై ఒత్తిడి పెరగవచ్చు.
ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, బీపీ, మధుమేహం ఉన్నవారు ఓఆర్ఎస్‌ను వైద్యుల సలహా లేకుండా ఎక్కువగా తాగకూడదు. వేసవిలో సాధారణంగా పుష్కలంగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, తాజా పండ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే సరైన మోతాదులో ఓఆర్ఎస్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు..
To get more interesting news, click the link below.
Drinking Too Much ORS in Summer? Hidden Health Risks Revealed

With the intense summer heat, many people drink ORS (Oral Rehydration Solution) to protect themselves from dehydration. Some even make it a habit to drink ORS-mixed water throughout the day. However, medical experts warn that consuming ORS excessively can be harmful to health.
ORS contains substances like sodium, potassium, and glucose. These help restore the body’s water and salt balance when dehydration occurs and support faster recovery. It is especially useful when a person sweats excessively or becomes dehydrated.
Who benefits from ORS?
- People who work for long hours in the sun
- Farmers and laborers doing field work
- Children and elderly people
- People suffering from diarrhea
In such situations, it is advisable to take ORS as per a doctor’s recommendation.
What happens if you drink too much ORS?
Since ORS contains high amounts of sugar and salt, drinking it frequently may cause several health issues:
- Blood sugar levels may increase
- People with high blood pressure may face problems
- The body’s electrolyte balance may get disturbed
- Extra strain may be placed on the kidneys
Especially people with kidney problems, heart disease, high blood pressure, or diabetes should not consume ORS excessively without medical advice.
Experts suggest drinking plenty of regular water, buttermilk, coconut water, and eating fresh fruits during summer. ORS should only be taken in the right quantity when dehydration actually occurs.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

