మధుయాష్కీ గౌడ్‌కు ఘన సన్మానం
- ఏఐపీసీ జాతీయ చైర్మన్‌గా ఎన్నికపై హర్షం – BSMAT.

హైదరాబాద్: ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) జాతీయ చైర్మన్‌గా ఎన్నికైన మధుయాష్కీ గౌడ్‌ను తెలంగాణ స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (BSMAT) ప్రతినిధులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో BSMAT అధ్యక్షులు శేఖర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, దయాకర్ రెడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ గౌడ్, డి తదితరులు పాల్గొన్నారు. మధుయాష్కీ గౌడ్‌కు లభించిన ఈ బాధ్యత దేశవ్యాప్తంగా వృత్తి నిపుణులను మరింతగా సంఘటితం చేసేందుకు, యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు దోహదపడుతుందని వారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఈ నెల 19న నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మధుయాష్కీ గౌడ్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినట్లు శేఖర్ రెడ్డి తెలిపారు. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో సేవలందిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో’ ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని ఈ సమావేశంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
విద్యా రంగానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను గుర్తించి, వారి ప్రతిభను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా రంగ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని పేర్కొన్నారు.
మధుయాష్కీ గౌడ్ నాయకత్వంలో విద్య, ఉపాధి, యువత అభివృద్ధి వంటి అంశాల్లో వృత్తి నిపుణుల భాగస్వామ్యం మరింత పెరగాలని శేఖర్ రెడ్డి, గుజ్జ సత్యం, దయాకర్ రెడ్డి భరత్ గౌడ్, ఆకాంక్షించారు.

