NewsTrendy

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు స్వదేశానికి.. శంషాబాద్‌కు 600 మంది చేరిక

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు క్రమంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. మంగళవారం, బుధవారం రోజుల్లో ఆరు ప్రత్యేక విమానాల ద్వారా 600 మందికి పైగా ప్రయాణికులు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే సురక్షితంగా స్వదేశానికి చేరుకోగలిగామని ప్రయాణికులు భావోద్వేగానికి గురయ్యారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పలు దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో దుబాయి, అబుదాబి, మస్కట్‌, దమామ్‌, జెద్దా, రియాద్‌ నగరాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *