సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ భూములను కాపాడుతాం: కవిత
రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలో ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను సుప్రీంకోర్టు వరకు వెళ్లి కాపాడుతామని స్పష్టం చేశారు. హైడ్రా..పేదల కాలనీల్లో దాడులు చేసి ఆ భూములను పెద్దలకు అప్పగిస్తోందని మండిపడ్డారు. శ్రీఆదిత్య కంపెనీ రివర్ బెడ్‌పైన ప్రాజెక్టు కడుతోందని.. ఆ కంపెనీ వెనుక ఓ ఎంపీ ఉన్నారన్నారు. శ్రీ ఆదిత్య కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే పర్మిషన్ ఇచ్చారని.. దాన్ని ముట్టుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లపై అవగాహన లేదని కవిత విమర్శించారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ఏపీ సీఎం ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎంతో మాట్లాడి 200 టీఎంసీల నీళ్లు తెచ్చి ఆ తర్వాత బనకచర్ల గురించి మాట్లాడాలన్నారు. అప్పుడు కేటీఆర్ పాలన నడిచిందని.. ఇప్పుడు కూడా కేటీఆర్ పాలనే నడుస్తోందన్నారు. అప్పుడు కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు.. ఇప్పుడు కేటీఆర్ అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ సవాళ్లతో ఒరిగేదేమీ లేదని కవిత విమర్శించారు.
తెలంగాణ బరాబర్ ప్రజల జాగీరే అని.. పవన్ కల్యాణ్ జాగీర్ కాదని కవిత స్పష్టం చేశారు. ఆంధ్రా విషకోరల నుంచి తెలంగాణను కాపాడుకున్నామన్నారు. ఇక్కడకు వచ్చి రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పవన్‌కు మద్దతు ఇస్తే నాలుగు ఓట్లు వస్తాయని బీజేపీ భావిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఉన్న 8 సీట్లు పోతాయన్నారు. పవన్ కల్యాణ్ 10 ఎకరాలు శిఖం భూమిని కొనుగోలు చేశారని.. కోడికుంట సర్వే నంబర్ 706లో శిఖం భూమి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో అనేక తప్పులు జరిగాయని.. ఆ భూమిని పవన్ తిరిగి ఇచ్చేయాలన్నారు. శిఖం భూమిలో వేసిన కంచెను పవన్ తొలగించాలని కవిత డిమాండ్ చేశారు.
To get more interesting news, click the link below.
Kavitha Alleges Telangana Government Is Handing Over Public Lands

Kavitha Alleges Telangana Government is Handing Over Public Land to Influential Individuals
Telangana Jagruthi leader and BRS MLC Kalvakuntla Kavitha alleged that the government led by Revanth Reddy is transferring government land worth ₹1 lakh crore to influential individuals. Speaking to the media on Saturday, she accused members of the Chief Minister’s family, senior government officials, Congress MPs, and MLAs of being involved in land-related irregularities.
Kavitha stated that her party would fight up to the Supreme Court to protect government lands. She alleged that HYDRAA is targeting poor colonies and subsequently handing over those lands to influential people. Referring to the Sri Aditya company, she claimed that a project is being constructed on a riverbed and alleged that a Member of Parliament is backing the company. She noted that the project had received permissions during the BRS government’s tenure and questioned whether the current government has the courage to take action against it.
Criticizing Chief Minister Revanth Reddy, Kavitha said he lacks proper understanding of water-related issues. She questioned why, if the Maharashtra Chief Minister was unavailable for a meeting, the Andhra Pradesh Chief Minister could not be approached. She urged the government to secure 200 TMC of water through discussions with Andhra Pradesh before commenting on the Banakacherla project.
Kavitha further remarked that governance in the state was effectively being run by “KTR” in both the previous and current administrations. She said that earlier “KTR” stood for K. Chandrashekar Rao, T. Harish Rao, and K. T. Rama Rao, while now it represents Kondal Reddy, Tirupati Reddy, and Revanth Reddy. She added that neither Congress nor BJP challenges would have any significant impact on her party.
Addressing remarks related to Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan, Kavitha said Telangana belongs to its people and is not anyone’s personal estate. She stated that Telangana had protected itself from what she described as “Andhra domination” and warned against attempts to influence Telangana politics from outside the state.
She also alleged that Pawan Kalyan had purchased 10 acres of shikam (waterbody) land and claimed that the land falls under Survey No. 706 in Kodikunta. According to her, several irregularities occurred during the registration process. She demanded that Pawan Kalyan return the land and remove the fencing erected on the disputed property.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates

