ఐపీఎల్-2026 విజేత ఎవరు.. అశ్విన్ చెప్పిన జోస్యం ఏంటంటే..
మరికాసేపట్లో అహ్మదాబాద్‌లో ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్ మొదలు కాబోతోంది. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా రాణించి లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లూ ఇంతకు ముందు ఒక్కోసారి టైటిల్ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏది రెండో టైటిల్ దక్కించుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఫైనల్ విజేతపై మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక కామెంట్లు చేశాడు ‘ఈ సీజన్ మొత్తం ఆర్సీబీ అద్భుత స్థిరత్వం ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యత, కీలక సమయాల్లో ఆటగాళ్ల ప్రదర్శన జట్టును ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా ప్లే-ఆఫ్స్ దశలో జట్టు చూపించిన ఆత్మవిశ్వాసం ఎంతో ఆకట్టుకుంది. ప్లే-ఆఫ్స్‌లో ఇప్పటికే గుజరాత్‌ను ఓడించింది. నా అభిప్రాయం ప్రకారం ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లో ఉంది. వరుసగా మరో టైటిల్ సాధించేందుకు ఆ జట్టు సిద్ధమవుతోంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు (Ashwin on RCB).
‘ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి కూడా గట్టి పోటీని ఆశించవచ్చు (RCB vs GT). గిల్, సాయి సుదర్శన్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఫైనల్‌లో ఒత్తిడిని ఎవరు బాగా ఎదుర్కొంటారన్నదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండడం గుజరాత్ టైటాన్స్‌కు బలం. అక్కడి పరిస్థితులపై వారికి అవగాహన ఎక్కువ. ఏదేమైనా ఈ సీజన్ మొత్తం ఆడినట్టుగానే చివరి మ్యాచ్‌లో కూడా ఆడితే టైటిల్ ఆర్సీబీ సొంతమవడం ఖాయం’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
To get more interesting news, click the link below.
RCB Hold the Edge in IPL Final,

The IPL 2026 Final is set to begin shortly in Ahmedabad, where two of the tournament’s most consistent teams, Royal Challengers Bengaluru and Gujarat Titans, will battle for the championship. Both teams have previously won one IPL title each, making the contest even more exciting as they aim to secure their second trophy.
Former Indian cricketer Ravichandran Ashwin shared his views on the final and backed RCB as the favorites.
“RCB have shown remarkable consistency throughout this season. Their balance in both batting and bowling, along with players stepping up in crucial moments, has made them a special side. The confidence they displayed during the playoffs has been particularly impressive. They have already defeated Gujarat in the playoffs. In my opinion, the final is in RCB’s hands. The team looks ready to win another title,” Ashwin said.
However, Ashwin also acknowledged the threat posed by Gujarat Titans.
“We can expect a strong challenge from Gujarat Titans as well. Shubman Gill and Sai Sudharsan are in excellent form. The team that handles pressure better in the final will likely emerge victorious. Playing at their home ground is an advantage for Gujarat because they are more familiar with the conditions. Nevertheless, if RCB perform in the final the way they have throughout the season, the title should belong to them,” he added.
The highly anticipated clash is expected to be a thrilling contest between two well-balanced teams, with the IPL 2026 trophy at stake.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates

