News

తెలంగాణలో భారీ ఐపీఎస్ బదిలీలు

Telangana Logo

సత్య తెలంగాణ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉన్నతాధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 45 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఉత్తర్వుల ప్రకారం, జీహెచ్‌ఎంసీ మల్కాజిగిరి జోన్ డీసీపీగా పనిచేస్తున్న రాహుల్ బోజ్జాను రాచకొండ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా పలు జిల్లాల్లో ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీసీపీలు మరియు ఇతర కీలక పదవుల్లో మార్పులు చేపట్టారు.

హైదరాబాద్ అండ్ సైబరాబాద్ పరిధిలోనూ కీలక బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో పరిపాలనా పరమైన సమన్వయం, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ మార్పులతో జిల్లాల వారీగా పోలీసు వ్యవస్థలో కొత్త ఉత్సాహం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *