NewsTrendy

పశ్చిమాసియా ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై జైశంకర్ కీలక ప్రకటన

పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై(West Asia Crisis) కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను భారత ప్రభుత్వం నిరంతరం గమనిస్తూ ఉందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

జైశంకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయులకు భారత ప్రభుత్వం తరచుగా అప్రమత్త సూచనలు (అడ్వైజరీలు) జారీ చేస్తోందని చెప్పారు. గల్ఫ్ దేశాలు భారత్‌కు కీలక వాణిజ్య భాగస్వాములని, అక్కడి పరిస్థితులపై భారత్ నిరంతరం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.

గల్ఫ్ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు భారతీయులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అవసరమైన వారికి హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని వెల్లడించారు. దోహా, జోర్డాన్ వంటి ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు కూడా సహాయం అందిస్తున్నామని చెప్పారు. భారత్‌కు తిరిగి రావాలనుకునే వారికి విమాన సర్వీసులు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇరాన్‌లోని పరిస్థితులపై అక్కడి విదేశాంగ మంత్రితో కూడా చర్చలు జరిపినట్టు జైశంకర్ వెల్లడించారు.

అదే సమయంలో క్రూడ్ ఆయిల్ అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. చమురు అవసరాల కోసం దేశ ప్రయోజనాలను ఎప్పుడూ తాకట్టు పెట్టబోమని స్పష్టం చేశారు. భారతీయుల ప్రయోజనాలే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని తెలిపారు.

దేశంలో చమురు నిల్వలు కూడా సమృద్ధిగా ఉన్నాయని జైశంకర్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నం, మంగళూరు, పడూర్ వంటి వ్యూహాత్మక కేంద్రాలతో పాటు పైప్‌లైన్లు, ట్యాంకులు, సముద్ర నౌకల్లో కలిపి సుమారు 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు.

To get more interesting news, click the link below.

Telangana TV

West Asia Crisis: Jaishankar Statement on Indian Safety in Gulf Countries

Amid the growing West Asia Crisis, India’s External Affairs Minister Subrahmanyam Jaishankar made an important statement regarding the safety of Indian citizens living in Gulf nations. The government is closely monitoring the West Asia Crisis and assessing its possible impact on millions of Indians working and living in the region.

According to officials, the West Asia Crisis has raised concerns about regional stability, and the government is taking precautionary steps to ensure the security of Indian nationals. The Jaishankar statement on Indian safety in Gulf countries reassured citizens that the situation is being carefully tracked.

What Jaishankar Said About Indians in Gulf Countries During the West Asia Crisis

During a recent briefing, the minister explained what Jaishankar said about Indians in Gulf countries while addressing the ongoing West Asia Crisis. He emphasized that the government is maintaining constant communication with Indian embassies and consulates across the Gulf region.

The West Asia Crisis impact on Indians abroad is being closely reviewed as part of the broader West Asia Conflict monitoring efforts. Authorities are gathering information and coordinating with local governments to ensure that Indian workers and professionals remain safe during the Middle East Security Crisis.

Indian Embassy Support Amid the West Asia Crisis

Diplomatic missions are playing a crucial role during the West Asia Geopolitical Crisis. The Indian embassy help for Indians in Gulf countries includes providing guidance, emergency contact support, and assistance to citizens who may face difficulties.

Officials have also highlighted that emergency support services for Indians in Middle East are fully operational during the West Asia Crisis. These services are designed to help Indians receive timely support and accurate information during uncertain situations caused by the West Asia Crisis.

India Monitoring the West Asia Crisis Closely

The India West Asia tensions latest news shows that the government continues to monitor every development related to the West Asia Conflict. Officials stated that India remains committed to ensuring the safety of its citizens and maintaining stability in the region.

The Indian government statement on Gulf countries safety also confirmed that embassies are ready to assist Indians if the West Asia Instability escalates. According to the Gulf Indians security update by Jaishankar, authorities are prepared to respond quickly and provide support whenever required.

Experts say the ongoing Middle East Conflict is also significant for India foreign policy West Asia news, as India continues to maintain diplomatic balance while prioritizing the safety of its citizens.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

One thought on “పశ్చిమాసియా ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై జైశంకర్ కీలక ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *