Education

వరంగల్‌లో పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం.. 9,492 మంది విద్యార్థులు హాజరు

వరంగల్‌ జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది.

జిల్లా కలెక్టర్ సత్యశారత ఇప్పటికే పలుమార్లు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. దానికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు కూడా పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.


జిల్లాలో 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం

ఈ ఏడాది వరంగల్ జిల్లాలోని 288 పాఠశాలల నుంచి మొత్తం 9,492 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.

  • బాలురు: 4,932 మంది
  • బాలికలు: 4,560 మంది

విద్యార్థులు పరీక్షలను సౌకర్యవంతంగా రాయడానికి జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.


పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

  • 47 మంది చీఫ్ సూపరింటెండెంట్లు (CS)
  • 48 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు (DO)
  • 47 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు
  • 496 మంది ఇన్విజిలేటర్లు

అదనంగా ప్రశ్నాపత్రాల బట్వాడ కోసం:

  • 6 మంది రూట్ ఆఫీసర్లు
  • 6 మంది అదనపు రూట్ ఆఫీసర్లు

అక్రమాలు నివారించేందుకు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు.


పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ

పరీక్షలు నిష్పక్షపాతంగా జరిగేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

  • 22 కేంద్రాల్లో శాశ్వత సీసీ కెమెరాలు
  • 25 కేంద్రాల్లో తాత్కాలిక సీసీ కెమెరాలు

ఇవి పరీక్షల సమయంలో నిరంతరం పర్యవేక్షణ నిర్వహించనున్నాయి.


విద్యార్థులకు స్పెషల్ క్లాసులు, అవగాహన కార్యక్రమాలు

పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతోంది.

  • అక్టోబర్ 1 నుంచి సాయంత్రం ప్రత్యేక తరగతులు
  • జనవరి 1 నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్పెషల్ క్లాసులు
  • మార్చి 6 నుంచి వారం రోజుల పాటు విషయ నిపుణులతో అవగాహన తరగతులు

ఈ చర్యలతో విద్యార్థులు పరీక్షలకు మరింత సిద్ధమవుతున్నారు.


నేటి నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్

పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు శుక్రవారం నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డీఈవో రంగయ్య నాయుడు మాట్లాడుతూ,
డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్లతోనే విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని తెలిపారు. హాల్ టికెట్‌పై హెడ్మాస్టర్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు.


జిల్లాను ముందంజలో ఉంచుతాం: డీఈవో రంగయ్య

డీఈవో రంగయ్య నాయుడు మాట్లాడుతూ, జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట సర్దుబాటు చేసి అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో పాఠ్యాంశాలు బోధించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. తల్లిదండ్రులు కూడా వారికి అవసరమైన సహకారం అందించాలి అని ఆయన సూచించారు.

To get more interesting news, click the link below.

Telangana TV

Warangal District Ready for Class 10 Board Exams – 9,492 Students to Appear

Authorities in Warangal district have completed all Class 10 SSC exams arrangements in Warangal, ensuring that students can attend the examinations smoothly and safely. According to officials, a total of 9,492 students attending SSC exams in Warangal will appear for the examinations this year. The education department has taken several measures to make sure that the Telangana SSC exam preparations in Warangal are conducted in an organized manner.

Officials stated that multiple Telangana SSC exam centers in Warangal district have been set up with necessary facilities for students. Proper seating arrangements, security, and monitoring systems have been arranged to ensure a fair and smooth examination process. With these preparations, Warangal district ready for class 10 board exams has become one of the key updates in Telangana education news Warangal.

Special Arrangements at Exam Centers

The district administration has carefully planned the arrangements at Telangana Warangal exam centers to avoid any inconvenience to students. Invigilators and staff have been appointed to manage the examination process, while authorities have also ensured that all Warangal students SSC exams are conducted according to board guidelines.

Officials also advised students to reach their examination centers early and follow all instructions provided by the board. With thousands of students preparing for the exams, the Warangal SSC exams news has drawn attention from parents and teachers across the district.

Students Preparing with Study Materials

In the days leading up to the exams, students have been actively using various resources such as SSC exam preparation books, class 10 study material, and SSC model papers download to improve their preparation. Teachers say that solving model papers and reviewing study materials can help students gain confidence before the exams.

Several educational institutions and SSC exam coaching centers in the district have also been guiding students with revision sessions and exam tips. These efforts are helping students feel more confident as the examination dates approach.

Focus on Smooth Conduct of Exams

With proper planning and coordination between education officials and school authorities, the class 10 exams in Warangal district are expected to proceed without major issues. The district administration has also arranged support teams to handle any unexpected situations during the exams.

Parents and teachers hope that the well-organized Telangana SSC exam preparations in Warangal will allow students to focus on their performance without stress. As thousands of students prepare to write their exams, the district is witnessing a sense of anticipation and determination among students aiming to achieve good results.

The successful organization of these exams reflects the commitment of the education department to ensure that Warangal students SSC exams are conducted in a fair and student-friendly environment.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *