NewsEducation

UPSC Civil Services Results 2026: అనూజ్ అగ్నిహోత్రికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్

సివిల్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుక్రవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ పరీక్షల్లో అనూజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి అగ్రస్థానంలో నిలిచారు. రెండో ర్యాంక్‌ను రాజేశ్వరి సువే సాధించగా, మూడో స్థానంలో ఆకాన్ష్ ధుల్ నిలిచారు. రాఘవ్ ఝున్‌ఝున్ వాలా నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నారు.

ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా విశేష ప్రతిభ కనబర్చారు. సృజన 55వ ర్యాంక్ సాధించగా, డీఎస్‌కే ప్రచేత్ 193వ ర్యాంక్ పొందారు. ఎస్. వర్షిత్ రెడ్డి 259వ ర్యాంక్ సాధించగా, ఎం. పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంక్ సాధించారు.

ఇంకా వి. విక్రమసింహారెడ్డి 541వ ర్యాంక్, గుమ్మల శ్వేత 573వ ర్యాంక్, పోతుపురెడ్డి భార్గవ్ 537వ ర్యాంక్, పుడారి రాహుల్ 748వ ర్యాంక్, కత్తిమాని అనిరుధ్ 786వ ర్యాంక్, కోరపాతుల శ్రీకర్ రాజు 806వ ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠను మరింత పెంచారు.

గతేడాది 2025లో నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు (మౌఖిక పరీక్షలు) చేపట్టారు.

ఈ చివరి దశలో మొత్తం 958 మంది అభ్యర్థులు సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. వీరంతా భారత పరిపాలనా సేవ (IAS), భారత విదేశాంగ సేవ (IFS), భారత పోలీసు సేవ (IPS)తో పాటు గ్రూప్-A, గ్రూప్-B కేటగిరీలలోని వివిధ కేంద్ర సేవల్లో నియమించబడనున్నారు.

దేశంలోని లక్షలాది మంది యువతకు ఈ ఫలితాలు ప్రేరణగా నిలుస్తున్నాయి. కష్టపడి చదివితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని మరోసారి ఈ విజేతలు నిరూపించారు.

To get more interesting news, click the link below.

Telangana TV

UPSC Civil Services Results 2026: Anuj Agnihotri Secures All India Rank 1

The UPSC Civil Services Results 2026 have been officially announced, bringing great excitement among aspirants across the country. In this year’s results, Anuj Agnihotri Rank 1 has become the biggest highlight, as he secured the All India Rank (AIR) 1 in the prestigious UPSC Civil Services Exam 2026.

The UPSC Civil Services Exam results 2026 list includes the names of successful candidates who cleared one of the toughest competitive exams in India. Every year, lakhs of aspirants appear for the examination, but only a few hundred make it to the final UPSC rank list 2026 topper details.

Who is UPSC Topper 2026 Anuj Agnihotri?

Many aspirants are now searching for “Who is UPSC topper 2026 Anuj Agnihotri?” After securing the top rank, Anuj Agnihotri has become an inspiration for civil services aspirants across India. His achievement in the UPSC 2026 topper Anuj Agnihotri biography has gained nationwide attention.

According to available information, Anuj Agnihotri prepared extensively for the Civil Services examination with strong dedication, consistent study plans, and strategic preparation. His success reflects years of hard work and determination.

UPSC Civil Services Exam Results 2026 List

The UPSC Civil Services Exam results 2026 list contains candidates selected for top administrative services such as:

  • Indian Administrative Service (IAS)
  • Indian Police Service (IPS)
  • Indian Foreign Service (IFS)
  • Indian Revenue Service (IRS)

The UPSC rank list 2026 topper details provide a complete overview of candidates who have qualified for these prestigious services.

Importance of UPSC Civil Services Examination

The UPSC Civil Services Examination is considered one of the most competitive exams in India. Conducted by the Union Public Service Commission, it selects candidates for the country’s top administrative positions.

Every year, thousands of aspirants dream of joining the civil services. The success story of UPSC 2026 topper Anuj Agnihotri serves as motivation for future candidates preparing for the examination.

Inspiration for Civil Services Aspirants

The achievement of Anuj Agnihotri Rank 1 in UPSC Civil Services Results 2026 proves that determination, discipline, and strategic preparation can help aspirants achieve success in one of India’s toughest exams.

Students preparing for UPSC now look up to Anuj Agnihotri’s biography and preparation strategy for guidance and inspiration.

For more updates on UPSC Civil Services Results 2026, topper stories, and rank list details, follow Satya Telangana Newspaper for reliable and timely news coverage.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *