NewsPolitics

42 శాతం రిజర్వేషన్ల మోసానికి నిరాశతో ఆత్మహత్యా.. బీసీ యువకుడి ఘటనపై గుజ్జ సత్యం తీవ్ర ఆవేదన

  • బలిదానాలు కాదుబలమైన పోరాటమే మార్గం”.
Gujja Sathyam reacts to Sai Eshwara Chari suicide over 42 percent BC reservations in Peerzadiguda

హైదరాబాద్, డిసెంబర్ 5, 2025: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం(Gujja Sathyam), పీర్జాదిగూడలో 42 శాతం రిజర్వేషన్ల అంశంపై నిరాశతో ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన సాయి ఈశ్వర చారి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బీసీ-బహుజన సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని, ఇకపై ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన పిలుపునిచ్చారు.

“బలిదానాలు కాదు… పోరాటమే మార్గం”

గుజ్జ సత్యం మాట్లాడుతూ, “సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదాన ఘటన ఎంతో బాధాకరం. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయనే బాధతో ఈ ఘటన చోటుచేసుకోవడం మనందరినీ కలచివేసింది. ఈ విషయంలో నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని అన్నారు.

అలాగే, హక్కుల కోసం పోరాటం చేస్తున్న యువత ఇలాంటి తీవ్ర నిర్ణయాలకు దిగడం సమాజానికి నష్టమని పేర్కొన్నారు. “తెలంగాణ సాధనలో ఇప్పటికే 1200 మందికి పైగా బీసీ, బహుజన, వంచిత వర్గాల యువత తమ ప్రాణాలు అర్పించారు. ఇక చాలు. ఇకపై బలిదానాలు కాదు — పోరాటమే మార్గం కావాలి” అని స్పష్టం చేశారు.

యువతకు కీలక సందేశం

“మన హక్కులు, మన రిజర్వేషన్లు, మన గౌరవం ఆత్మహత్యలతో రావు. అవి ఐక్యతతో, చైతన్యంతో, రాజకీయ శక్తితో మాత్రమే సాధ్యమవుతాయి. ఈ సంఘటన మనందరికీ ఒక గట్టి హెచ్చరికగా ఉండాలి. ఇకపై ఎవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు” అని గుజ్జ సత్యం సూచించారు.

ఓటుతోనే సమాధానం

అధిపత్య కులాల దోపిడీకి చెక్ పెట్టాలని, బీసీల రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. “మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అది మన ఓటు ద్వారా, మన ఆత్మగౌరవం ద్వారా నిర్మించబడుతుంది. మనకు మోసం చేసిన వారిని ఓటుతోనే ప్రశ్నించాలి” అని అన్నారు.

మహనీయుల మార్గంలో నడుద్దాం

ఫూలే, అంబేడ్కర్, కాన్షీరాం చూపిన మార్గంలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. “తెలంగాణ మళ్లీ బలిదానాల గడ్డ కాకూడదు. అది పాలన, గౌరవం, న్యాయం, హక్కుల కేంద్రంగా మారాలి. మన ఆశయాలను సాధించాలంటే ఐక్యతతో ముందుకు సాగాలి” అని తెలిపారు.
సాయి ఈశ్వర చారి ఘటనపై గుజ్జ సత్యం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బీసీ-బహుజన యువతకు ఆత్మహత్యలు కాదు — ఐక్యతతో పోరాటం ద్వారానే హక్కులు సాధ్యమని స్పష్టమైన సందేశం ఇచ్చారు.

To get more interesting news, click the link below.

Telangana TV


Sai Eshwara Chari Suicide Shock: Gujja Sathyam Strong Reaction

abad, December 5, 2025: National BC Welfare Association Vice President Gujja Sathyam expressed deep grief over the tragic death of Sai Eshwara Chari, who attempted suicide in Peerzadiguda over disappointment regarding the 42 percent reservations issue. He stated that the incident has shaken the BC Bahujan community and urged that such painful incidents must not be repeated.

“Not Sacrifices… Struggle is the Way”

Speaking on the incident, Gujja Sathyam said, “The Sai Eshwara Chari suicide is extremely heartbreaking. The frustration over political parties betrayal on the 42 percent reservations demand led to this tragic step, which has deeply disturbed all of us. I express my profound condolences.”

He emphasized that youth fighting for their rights taking such extreme steps is a major loss to society. “During the Telangana movement, over 1,200 youth from BC Bahujan community, backward and marginalized sections sacrificed their lives. Enough is enough. From now on, not sacrifices — rights movement must be the path,” he said.

Key Message to Youth

BC youth must understand that their rights, reservations, and dignity cannot be achieved through suicide. They can only be secured through unity, awareness, and political empowerment. This incident should serve as a strong warning. No one should take such steps again,” Gujja Sathyam advised.

Answer Through Vote

He called for unity in the BC political empowerment struggle and urged people to fight against exploitation by dominant sections. “Our future is in our hands. It will be built through our vote, our self-respect, and our struggle. Those who cheated us must be questioned through the democratic process,” he said.

Follow the Path of Great Leaders

He urged people to walk in the path shown by Jyotirao Phule, Dr. B.R. Ambedkar, and Kanshi Ram. “Telangana should not become a land of sacrifices again. It must become a center for governance, dignity, justice, and rights. Only through unity can we achieve our goals,” he added.

Summary

Reacting to the Sai Eshwara Chari suicide, Gujja Sathyam strongly appealed to the BC Bahujan community and BC youth to choose unity and struggle over sacrifice, stressing that 42 percent reservations and justice can only be achieved through collective effort and political awareness.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.