మూసీ బాధితురాలి ఆవేదన.. “నేను చచ్చినా చచ్చిపోతా.. కానీ మా ఇల్లు కూలగొట్టొద్దు”
మూసీ సుందరీకరణ అంశం మళ్లీ రాజకీయంగా వేడెక్కింది. నాగోల్‌లో గత కేసీఆర్ ప్రభుత్వ కాలంలో నిర్మించిన STP ప్లాంట్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ వాణిదేవి తదితర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఒక వృద్ధ మహిళ తన జీవిత బాధలను కన్నీళ్లతో వెల్లగక్కింది. “నేను కూడా మూసీ బాధితురాలినే. మొదటిసారి హైడ్రా వచ్చినప్పుడు నా కోడలు నిండు గర్భిణీ. అయినా బయట నిలబెట్టారు. నాకు గుండె దడ ఉండేది. మా ఆయన 30 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇళ్లల్లో పని చేసుకుంటూ కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నా” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
“ఇప్పుడు ఇల్లు కూలుస్తామంటున్నారు. నేను ఎలా ఓర్చుకుంటా? నాకు పెళ్లి కావాల్సిన 18 ఏళ్ల అమ్మాయి ఉంది. ఇల్లు లేకుండా ఆమె పెండ్లి ఎలా చేస్తా? నాకు ఇద్దరు కొడుకులు.. చిన్నకొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదు. నేను చచ్చినా చచ్చిపోతా కానీ మా ఇల్లు కూలగొట్టొద్దు అని అడిగాను” అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
తన కొడుకు కూడా ఆవేదనతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆమె తెలిపింది. “ఓట్లు వేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఇలాంటి కష్టాలు పెడుతున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు రూ.2 వేల పెన్షన్ ఇచ్చారు. ఇప్పటికీ అదే వస్తోంది. మూసీని బాగు చేయాలంటే చేయండి.. కానీ మా ఇండ్ల నుంచి మమ్మల్ని పంపొద్దు” అంటూ ఆమె విన్నవించింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మూసీ పరివాహక ప్రాంత ప్రజలను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రూ.16 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేయలేకపోతే తాము చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
To get more interesting news, click the link below.
Musi Victim’s Emotional Appeal: “Even if I Die, Please Don’t Demolish My House”
A heartbreaking scene unfolded near the Musi river in Hyderabad as a woman made an emotional plea to officials not to demolish her home. The incident has drawn attention across the city, highlighting the growing Musi river demolition issue in Hyderabad and the struggles faced by families living along the riverbanks.
The Musi victim’s emotional appeal against house demolition reflects the deep fear and uncertainty among residents who are worried about losing their homes. The woman reportedly said she could not imagine life without the house where her family has lived for years. Her emotional words, “Even if I die, please do not demolish my house,” moved many people who witnessed the situation.
Residents Protest Against Demolition
The situation has sparked Hyderabad residents protest news, as several families expressed concern about the demolition drive in the Musi river area. According to local residents, the ongoing Musi river demolition news in Hyderabad has created anxiety among people who fear displacement.
Many residents say they are not against development but want proper support and time to relocate. The residents protest against house demolition in the Musi area reflects the demand for fair solutions and respectful treatment for families affected by the project.
Musi River Project and Its Impact
Authorities have explained that the action is part of the Musi river restoration project details, which aims to improve the river environment and prevent flooding in the future. Officials say the project is designed to clean and develop the riverfront while ensuring long-term safety for nearby areas.
However, the Musi river project affecting houses in Hyderabad has raised concerns among local communities. Several families have questioned why houses are being demolished near Musi river, asking for clear information about the plans and their future.
Government Rehabilitation Plans
In response to these concerns, officials have mentioned government rehabilitation plans for Musi victims. The government says that steps are being taken to provide alternative housing or support for those who may lose their homes due to the development work.
Even so, many residents want assurances that the rehabilitation process will be fair and transparent. They believe that development projects should also consider the emotional and social impact on people who have lived in these areas for decades.
A Growing Public Discussion
The emotional incident has quickly become a major topic in Hyderabad Musi river news and Telangana latest news today. Social media users and local organizations are also discussing the issue, calling for a balanced approach that protects both urban development and human dignity.
As the situation continues to unfold, the voices of affected residents remain at the center of the discussion. Their stories remind everyone that behind every development project are families whose lives can change overnight.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

