NewsEducationViral

JEE Advanced 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష, ఏప్రిల్ 23 నుంచి రిజిస్ట్రేషన్

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Advanced 2026) పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షను మే 17, 2026న నిర్వహించనున్నట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ ప్రకటించింది.

అధికారిక ప్రకటన ప్రకారం, భారతీయ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్స్ తుది విడత ఫలితాలు వచ్చిన వెంటనే ఈ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే విదేశీ విద్యార్థుల దరఖాస్తులను ఏప్రిల్ 6 నుంచే స్వీకరించనున్నారు. అన్ని అభ్యర్థులు మే 2 వరకు తమ దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ను సందర్శించి నమోదు చేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు పేపర్లుగా రెండు షిఫ్టుల్లో జరుగుతుంది.

  • పేపర్-1: ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు
  • పేపర్-2: మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు

ఈ పరీక్ష ఫలితాలను జూన్ 1న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అనంతరం జూన్ 2 నుంచి JoSAA కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT 2026) కోసం జూన్ 1 నుంచి జూన్ 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష జూన్ 4న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది. AAT ఫలితాలు జూన్ 7న ప్రకటించనున్నారు.

అర్హత ప్రమాణాలు

  • JEE Main 2026 పేపర్-1లో టాప్ 2.5 లక్షల ర్యాంకుల్లో ఉన్న అభ్యర్థులు మాత్రమే JEE Advanced కు అర్హులు.
  • ఒక్క అభ్యర్థి గరిష్టంగా రెండు సార్లు మాత్రమే ఈ పరీక్ష రాయవచ్చు.
  • అభ్యర్థులు 2025 లేదా 2026లో 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి.
  • ఇప్పటికే ఏదైనా ఐఐటీలో అడ్మిషన్ పొందిన వారు ఈ పరీక్షకు అర్హులు కారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్న నిర్దిష్ట కేంద్రాలలో జరుగుతుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు.

To get more interesting news, click the link below.

Telangana TV

JEE Advanced 2026 Schedule Released: Exam on May 17

The schedule for the Joint Entrance Examination (JEE Advanced 2026), conducted for admission into prestigious Indian Institutes of Technology (IITs) across the country for the 2026–27 academic year, has been officially released. The Indian Institute of Technology (IIT) Roorkee announced that the examination will be held on May 17, 2026.

According to the official notification, the online registration process for Indian candidates will begin on April 23, 2026. The registration will start a day after the final results of JEE Main 2026 are announced. However, foreign candidates can submit their applications from April 6, 2026. The last date to complete the registration process is May 2, 2026. Interested candidates can apply through the official website jeeadv.ac.in.

The JEE Advanced 2026 exam will be conducted in Computer-Based Test (CBT) mode and will consist of two papers held in two shifts on the same day.

  • Paper 1: 9:00 AM – 12:00 PM
  • Paper 2: 2:30 PM – 5:30 PM

The results of JEE Advanced 2026 will be announced on June 1 at 10:00 AM. Following the results, the JoSAA (Joint Seat Allocation Authority) counselling process will begin from June 2, 2026.

Candidates who qualify in JEE Advanced will also have the opportunity to register for the Architecture Aptitude Test (AAT 2026). The registration for AAT will be open from June 1 (10:00 AM) to June 2 (5:00 PM). The AAT 2026 exam will be conducted on June 4 from 9:00 AM to 12:00 PM, and the results will be declared on June 7, 2026.

Eligibility Criteria

  • Only candidates who secure a rank within the top 2.5 lakh in JEE Main 2026 Paper 1 will be eligible to register for JEE Advanced 2026.
  • A candidate can attempt JEE Advanced a maximum of two times in two consecutive years.
  • Candidates must have appeared for Class 12 (or equivalent) for the first time in 2025 or 2026.
  • Physics, Chemistry, and Mathematics must be compulsory subjects in Class 12.
  • Candidates who have already been admitted to any IIT in the past are not eligible to appear for the exam again.

The JEE Advanced 2026 exam will be conducted at designated centers across India in CBT mode. The question paper will be available in both English and Hindi. Based on the rank obtained in the exam, candidates will be offered B.Tech admissions in 23 IITs across India.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *