బీసీ హాస్టళ్ల మెస్ బిల్లులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: ఆర్. కృష్ణయ్య, గుజ్జ సత్యం

హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ కాలేజీ హాస్టళ్లు మరియు ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు సంబంధించిన మెస్ బిల్లులు, హాస్టల్ అద్దె బిల్లులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను (Fee Reimbursement Dues) తక్షణమే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మరియు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో వారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి రాష్ట్రంలోని బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గత ఆరు నెలలుగా బీసీ కాలేజీ హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు సంబంధించిన మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ తీవ్ర సంక్షోభంలో పడిందని వారు తెలిపారు.
హాస్టళ్లకు కూరగాయలు, గుడ్లు, మాంసం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్న వ్యాపారులకు నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హాస్టళ్లకు అవసరమైన సరఫరాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలోని చాలా బీసీ హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, అయితే నెలలుగా అద్దె బిల్లులు చెల్లించకపోవడంతో భవన యజమానులు హాస్టళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. దీంతో విద్యార్థుల వసతి, చదువుపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయాయని, దీని వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయని పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే స్పందించి మెస్ బిల్లులు, అద్దె బిల్లులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి హాస్టళ్ల నిర్వహణను సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్. కృష్ణయ్య మరియు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
To get more interesting news, click the link below.
BC Fee Reimbursement Crisis: Thousands of Students Affected
BC Fee Reimbursement Dues Push Students Into Crisis
The issue of BC Fee Reimbursement Dues in the state has reached a critical stage, with pending amounts reportedly running into thousands of crores. This growing financial burden is severely impacting thousands of Backward Class (BC) students, many of whom are now struggling to continue their higher education.
Due to the delay in reimbursement, several students are unable to pay college fees on time, leading to disruptions in their academic journey. In some cases, students are reportedly being denied access to classes, exams, and certificates, further deepening their uncertainty about the future.
Impact of BC Fee Reimbursement Dues on Higher Education
The delay in clearing BC Fee Reimbursement Dues is not just a financial issue—it is becoming a major educational crisis. Students from economically weaker backgrounds rely heavily on these reimbursements to pursue higher studies.
Without timely financial support:
- Many students are forced to take loans or drop out
- Colleges face financial strain due to unpaid fees
- Academic performance and attendance are adversely affected
Education experts warn that prolonged delays could lead to a significant drop in enrollment among BC students, reversing years of progress in educational inclusion.
Hostel Crisis Deepens Due to Pending Bills
The crisis has also severely affected hostel facilities across the state. Pending mess bills, building rents, electricity charges, and maintenance costs have put hostel managements under immense pressure.
As a result:
- Food quality in hostels is deteriorating
- Basic facilities are being compromised
- Hostel operators are struggling to sustain services
Leaders pointed out that unless BC Fee Reimbursement Dues and related bills are cleared immediately, the entire hostel system could face collapse, directly affecting students who depend on these facilities.
Leaders Raise Concern Over BC Fee Reimbursement Dues
Prominent leaders R. Krishnaiah and Gujja Sathyam expressed serious concern over the worsening situation. They stated that the problems faced by BC students have reached an alarming level and require urgent government intervention.
They urged the government to:
- Immediately release pending fee reimbursement dues
- Clear hostel-related bills including mess and rent
- Ensure uninterrupted support for students’ education
According to them, neglecting this issue could jeopardize the future of thousands of students and widen social and educational inequalities.
Call for Immediate Government Action
The leaders strongly appealed to the government to prioritize the educational welfare of BC students. They emphasized that education is a fundamental right and financial barriers should not hinder students’ aspirations.
They also called for:
- A streamlined system for timely fee reimbursement
- Increased budget allocation for BC welfare schemes
- Regular monitoring to avoid future delays
Ensuring timely clearance of BC Fee Reimbursement Dues will not only support students but also strengthen the overall education system in the state.
Conclusion
The growing BC Fee Reimbursement Dues crisis is a serious concern that demands immediate attention. With thousands of students’ futures at stake, swift and decisive action from the government is crucial.
Clearing pending dues, stabilizing hostel operations, and ensuring continuous financial support will play a key role in safeguarding the educational prospects of BC students and promoting inclusive growth.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

