NewsPolitics

బీసీలకు టికెట్ల విషయంలో సీఎం కేసీఆర్ నోరు విప్పాలి.. గుజ్జసత్యం డిమాండ్.

బీసీల టికెట్ల విషయంలో జరుగుతున్న చర్చకు బీఆర్ఎస్ మంత్రులు క్లారిటీ ఇస్తే సరిపోదని, సీఎం కేసీఆర్ ముం దుకొచ్చి చెప్పాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీలకు కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నా రన్నారు. ఎంబీసీల కార్పొరేషన్ కు బడ్జెట్ లో రూ.2,433 కోట్లు కేటాయించి కేవలం రూ7 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు99 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ వర్గాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే కుల, చేతి వృత్తులకు, మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నామన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించని పథకాలను ప్రకటించి మరోసారి బీసీ వర్గాల ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *