News

మున్సిపల్ ఎన్నికల్లో ‘బీసీల ఓటు బీసీలకే’ : గుజ్జ సత్యం పిలుపు

  • రాజకీయాలకు అతీతంగా బీసీల ఐక్యతను చాటండి
Gujja Sathyam speaking on BC Municipal Elections Telangana 2026 and urging BC voters to support BC candidates

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) రాజకీయ పార్టీలకు అతీతంగా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను గెలిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు. “ఓటు మనదే – సీటు మనదే, బీసీల ఓటు బీసీలకే” అనే నినాదంతో బీసీ ఓటర్లు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన సూచించారు.

హైదరాబాద్‌లోని బీసీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికలను బీసీల రాజకీయ ఐక్యతను ప్రదర్శించే వేదికగా మార్చుకోవాలని కోరారు. జనరల్ స్థానాలు ఏకపక్షంగా కొన్ని వర్గాలకు మాత్రమే కేటాయించినవి కాదని, రిజర్వేషన్లు లేని చోట పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయంగా న్యాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అయితే బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కనిపించిన చైతన్యం మున్సిపల్ ఎన్నికల్లో మరింతగా ప్రతిఫలించాలని సూచించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడిన గుజ్జ సత్యం, పార్టీలు సిద్ధాంతాల కంటే పొత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. వివిధ పార్టీల మధ్య జరుగుతున్న పొత్తులను ప్రస్తావిస్తూ, బీసీలు రాజకీయ పార్టీలను కాకుండా అభ్యర్థి సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయలేదని పేర్కొంటూ, ఈ ఎన్నికలను బీసీల ఆత్మగౌరవానికి పరీక్షగా భావించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా బీసీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా సెక్రటరీ సూర్యనారాయణ, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జెల్ల నరేందర్, మరపంగు వెంకన్న, కర్నాటి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

To get more interesting news, click the link below.

Telangana TV

BC Leaders Call for Unity in Telangana Municipal Elections 2026

BC Municipal Elections Telangana 2026: Gujja Sathyam’s Key Appeal

Hyderabad, February 8: Ahead of the BC Municipal Elections Telangana 2026, National BC Welfare Association leader Gujja Sathyam has called upon voters to support BC candidates contesting in general seats, irrespective of political party affiliations. His statement has gained attention as a major Gujja Satyanarayana BC Statement in the current political scenario.

Speaking at a media conference held at the BC state office in Hyderabad, he urged voters to unite under the slogan, “Our vote – our seat, BC vote for BC candidates”, strengthening the campaign around BC Vote BC Candidates Telangana.

BC Candidates Support Telangana Elections Gains Momentum

Sathyam emphasized that voters must rise above party lines and support BC candidates, turning the elections into a strong platform for BC Candidates Support Telangana Elections. He said the elections in 116 municipalities and three corporations reflect a crucial moment in the Municipal Elections Telangana BC Issue.

Telangana Municipal Elections BC Leaders Call for Unity

Highlighting the importance of unity, Sathyam said the ongoing elections represent a broader Telangana Municipal Elections BC Leaders Call. He urged BC communities to demonstrate collective strength and ensure political visibility.

He also pointed out that while reservations are implemented for SC and ST communities based on population, BCs are still lacking fair opportunities. This raises concerns about BC Political Representation Telangana.

Telangana BC Unity Elections 2026: Focus Beyond Party Lines

Criticizing political parties, Sathyam said alliances are being prioritized over ideologies. He called on voters to choose candidates based on social background rather than party affiliation, reinforcing the concept of Telangana BC Unity Elections 2026.

BC Reservation Demand Telangana Politics Intensifies

He further alleged that both central and state governments have failed to deliver justice in BC reservations. This has intensified discussions around BC Reservation Demand Telangana Politics, making these elections a test of self-respect for the BC community.

BC Welfare Association Telangana News: Leaders Attend Meeting

The developments are being widely followed under BC Welfare Association Telangana News. The meeting was attended by BC Welfare Association South India Secretary Suryanarayana and state leaders Jella Narendra, Marapangu Venkanna, and Karnati Lokesh.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.