NewsPoliticsUsefulViral

‘బీసీ బంధు’ను ప్రవేశపెట్టాలి – గుజ్జ సత్యం బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు

సీఎం కేసీఆర్ బీసీల మనో భావాలను గ్రహించి “బీసీ బంధు’ పథకాన్ని ప్రవే శపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్య క్షుడు గుజ్జ సత్యం విజ్ఞప్తి చేశారు. గురువారం విలేక రులతో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడి చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రజాస్వామ్య బద్ధంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ , న్యాయం చేయడంలేదని ఆరోపించారు. బీసీ కార్పొ రేషన్లో ఉన్న పెండింగ్ రుణాలను వెంటనే మంజూ రుచేయాలని పేర్కొన్నారు. అన్ని బీసీ కులాల కుటుంబానికి లక్ష రూపాయల రుణం మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా రెండు గురుకుల పాఠ శాలలను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *