News

సాయి చంద్ మృతి తెలంగాణకు తీరని లోటు – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన ప్రముఖ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. సాయి చంద్ ఆకస్మిక మరణించడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని గురువారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటతో ప్రజలను ఎంతో చైతన్యం చేశారని అన్నారు. తెలంగాణ సమాజం ఒక గొప్ప గొంతుకను కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో సాయి చంద్ విస్మరించలేని పాత్ర పోషించారని, ఆయనను తెలంగాణ సమాజం ఎన్నడూ మర్చిపోరని అన్నారు. సాయి చంద్ ఆత్మ శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *