healthNews

కరీంనగర్‌లో విషజ్వరాల విజృంభణ.. డెంగీ భయం!

జిల్లావ్యాప్తంగా జ్వరాలతో ప్రజలు విలవిల.. ఆస్పత్రుల్లో పెరుగుతున్న ఇన్‌పేషెంట్లు | పారిశుధ్య లోపాలతో దోమల బెడద | డెంగీ లక్షణాలతో వందలాది మంది చికిత్స

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాను సీజనల్‌ వ్యాధులు వణికిస్తున్నాయి. పల్లె నుంచి పట్టణం వరకు విషజ్వరాలు, వైరల్‌ ఫీవర్‌, డెంగీ లక్షణాలు కలవరపెడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జ్వరంతో పాటు దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారు త్వరగా జ్వరాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ఆస్పత్రికి పెరుగుతున్న బాధితుల తాకిడి

కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రికి జ్వర లక్షణాలతో వస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రికి వచ్చిన వారిలో పలువురిని వైద్యులు పరీక్షించి అవసరమైన వారికి ఇన్‌పేషెంట్‌ చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రిలో జ్వర బాధితులు, డెంగీ అనుమానితులు పెరుగుతుండటంతో వైద్య సిబ్బందిపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.

ఇదే సమయంలో కరీంనగర్‌ ప్రైవేటు ఆస్పత్రులు సైతం జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లుగా చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి ఆసక్తి చూపని పలువురు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

ఇంటి వద్దే చికిత్స.. మెడికల్‌ షాపులపై ఆధారం

జ్వరంతో బాధపడుతున్న వారిలో కొంతమంది ఆస్పత్రులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటూ మెడికల్‌ షాపుల నుంచి మందులు తెచ్చుకుని వినియోగిస్తున్నారు. దీంతో వాస్తవంగా కరీంనగర్‌లో జ్వర బాధితుల సంఖ్య ఎంత? డెంగీ కేసులు ఎన్ని? అనే అంశంపై స్పష్టమైన గణాంకాలు బయటకు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం వల్ల వ్యాధి తీవ్రతను గుర్తించడంలో ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జ్వరం తగ్గకపోవడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, నీరసం, వాంతులు, రక్తస్రావ లక్షణాలు వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది.

వర్షాల తర్వాత విపరీతమైన ఎండ.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు

గత నెల చివరి వారంలో కురిసిన వర్షాల అనంతరం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. వర్షాలు పడిన తర్వాత విపరీతమైన ఎండలు కాస్తుండటంతో వాతావరణ పరిస్థితులు సీజనల్‌ వ్యాధులకు అనుకూలంగా మారాయి. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో దోమల వృద్ధి పెరగడం, మరోవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

డెంగీ లక్షణాలతో వందలాది మంది?

జిల్లా ఆసుపత్రికి వచ్చిన జ్వర బాధితుల్లో కొందరిలో డెంగీ లక్షణాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ అనుమానంతో, ప్లేట్‌లెట్స్‌ తగ్గడంతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య వందల్లో ఉందనే చర్చ జరుగుతోంది.

అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రతి జ్వర బాధితుడిని డెంగీ కేసుగా పరిగణించలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. పరీక్షల ద్వారా మాత్రమే డెంగీని నిర్ధారించాల్సి ఉంటుంది. దీంతో జిల్లాలో డెంగీ కేసులపై అధికారిక గణాంకాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది.

పడకేసిన పారిశుధ్యం.. పెరిగిన దోమల బెడద

సీజనల్‌ వ్యాధుల విజృంభణకు మరో ప్రధాన కారణంగా పారిశుధ్య లోపాలు కనిపిస్తున్నాయి. గ్రామపంచాయతీలతో పాటు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.

పలు చోట్ల మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో దోమల వృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పట్టణ శివారు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని ప్రాంతాల్లో మురికి కుంటలు ఏర్పడుతున్నాయి. ఖాళీ స్థలాల్లో నిలిచిన నీరు, పాత టైర్లు, కొబ్బరి బొండాలు, ఇతర వ్యర్థాల్లో చేరిన నీరు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి.

దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు నిల్వ నీటిని తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం కీలకం.

ఒకరి నుంచి మరొకరికి వైరల్‌ ఫీవర్‌?

వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న వారిలో దగ్గు, జలుబు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చిన తర్వాత ఇతర కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యానికి గురవుతున్న సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

దీంతో కరీంనగర్‌లో వైరల్‌ ఫీవర్‌ పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు త్వరగా జ్వరాల బారిన పడుతున్న నేపథ్యంలో కుటుంబాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ముందస్తు చర్యల్లో యంత్రాంగం విఫలమైందా?

సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నప్పటికీ ముందస్తు నివారణ చర్యలు ఆశించిన స్థాయిలో చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాధులు వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులు, జ్వర నిర్ధారణ శిబిరాలు, దోమల నివారణ చర్యలు, పారిశుధ్య కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది.

గత ఏడాది నిర్వహించిన తరహాలో ఇంటింటి జ్వర సర్వే ఈసారి పూర్తిస్థాయిలో చేపట్టలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రతి కాలనీ స్థాయిలో జ్వర బాధితులను గుర్తించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తే వ్యాధి తీవ్రతను ముందుగానే అంచనా వేయవచ్చని ప్రజలు కోరుతున్నారు.

డెంగీ తగ్గినా.. జ్వర బాధితులు పెరిగారు

గత రెండేళ్లతో పోలిస్తే డెంగీ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ జ్వర బాధితుల సంఖ్య మాత్రం ఈసారి పెరిగినట్లు స్థానిక పరిస్థితులు సూచిస్తున్నాయి. దీంతో కేవలం డెంగీ కేసులపైనే కాకుండా వైరల్‌ ఫీవర్‌, ఇతర సీజనల్‌ వ్యాధులపైనా వైద్య ఆరోగ్యశాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

కరీంనగర్‌ జిల్లాలో విషజ్వరాలు, వైరల్‌ ఫీవర్‌, డెంగీ అనుమానిత కేసుల పెరుగుదల నేపథ్యంలో అధికారులు గ్రామాలు, పట్టణాలు, శివారు కాలనీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఫీవర్‌ సర్వే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దోమల నియంత్రణ, నిల్వ నీటి తొలగింపు, డ్రైనేజీ శుభ్రత, వైద్య శిబిరాల నిర్వహణను వేగవంతం చేస్తేనే సీజనల్‌ వ్యాధుల వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుంది.

To get more interesting news, click the link below.

Telangana TV

Karimnagar Viral Fever Outbreak Dengue Fears Rise as Hospitals Fill With Patients

Karimnagar viral fever cases rise as dengue fears grip district

Karimnagar district witnesses a surge in fever cases, cough and cold symptoms; government and private hospitals report rising in-patient admissions amid sanitation concerns

Karimnagar: People across Karimnagar district are increasingly battling seasonal illnesses, with viral fever, dengue-like symptoms, cough and cold reported in several villages and urban areas. Government and private hospitals in Karimnagar are witnessing a steady increase in patients suffering from fever-related ailments, raising concerns over the spread of seasonal diseases.

The Karimnagar viral fever situation appears to be particularly worrying as several patients arriving at the district hospital are reportedly requiring admission for further treatment. At the same time, private hospitals across Karimnagar are also seeing a growing number of in-patients with fever and related symptoms.

Many people are also avoiding hospitals and opting for self-medication by purchasing tablets directly from medical shops. Health experts generally advise patients with persistent or high fever to seek medical evaluation rather than relying solely on self-medication.

Dengue symptoms add to concern

The recent rise in dengue symptoms in Karimnagar has added to public concern. Following rains during the last week of the previous month, the district experienced intense heat, creating conditions that may contribute to the spread of seasonal illnesses.

Health officials have reportedly identified patients arriving at the district hospital with dengue-like symptoms. Meanwhile, private hospitals are treating a significant number of patients who are seeking medical attention for symptoms associated with dengue, including reduced platelet counts.

However, dengue cannot be confirmed solely on the basis of symptoms or a low platelet count. Proper medical evaluation and appropriate diagnostic testing are required for confirmation.

Private hospitals witnessing growing admissions

A large number of patients who prefer private healthcare facilities are reportedly approaching hospitals in Karimnagar with fever, cough, cold and body pains. The number of patients being admitted as in-patients is said to be increasing day by day.

The situation has also highlighted the need for reliable district-level data on dengue cases, viral fever cases and other seasonal diseases in Karimnagar.

While dengue cases are reportedly lower compared with the previous two years, the overall number of fever patients appears to have increased this season.

Poor sanitation raises mosquito-breeding concerns

Poor sanitation is emerging as another major concern in the district. Sanitation management in several gram panchayats, municipalities and urban areas is reportedly inadequate.

Stagnant sewage and wastewater flowing onto roads are creating favourable conditions for mosquito breeding. In several peripheral colonies, poor drainage systems have resulted in the formation of stagnant water pools in open plots.

Discarded coconut shells, old tyres and other containers holding stagnant rainwater can become potential breeding sites for mosquitoes.

With mosquito breeding increasing in stagnant water, residents are concerned about the possibility of dengue fever and other mosquito-borne diseases spreading further.

Viral fever patients suffering from cough and cold

Many patients suffering from viral fever in Karimnagar are also complaining of cough and cold. In some households, when one family member develops fever, other members reportedly develop similar symptoms later.

Children and elderly people are particularly vulnerable to seasonal infections and require greater attention when symptoms persist.

Doctors generally recommend adequate hydration, rest and medical consultation when fever is persistent, severe or accompanied by warning signs.

Failure to take preventive measures?

The increasing number of fever cases has also triggered criticism over the preparedness of the local health and civic authorities.

Residents allege that preventive measures should have been intensified before the seasonal diseases began spreading. Fever camps, sanitation drives, mosquito-control measures and door-to-door fever surveys could play an important role in identifying cases at an early stage.

The door-to-door fever survey reportedly conducted last year has not been carried out on the same scale this time, raising concerns among residents.

Need for intensive fever surveillance

With Karimnagar viral fever cases increasing, residents are demanding stronger surveillance across both rural and urban areas. Health authorities need to identify fever clusters, conduct medical camps in affected areas and ensure timely diagnostic facilities.

Civic authorities also need to intensify sanitation activities, clear stagnant water, clean drains and undertake mosquito-control operations in vulnerable locations.

The focus should not be limited only to dengue. Viral fever, respiratory infections and other seasonal diseases also need systematic monitoring.

Public health challenge for Karimnagar

The current situation highlights the importance of coordinated action between the health department, municipalities, gram panchayats and local communities.

Although the reported number of dengue cases may be lower than in previous years, the rise in overall fever cases in Karimnagar cannot be ignored. Early detection, proper diagnosis, timely treatment and improved sanitation will be crucial in preventing the situation from worsening.

Authorities are expected to step up dengue prevention measures, fever surveillance, sanitation drives and mosquito-control activities across Karimnagar district to protect residents from the growing seasonal disease burden.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates


Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *