ఫారం సమర్పించినా ఓటర్ జాబితాలో పేరు గల్లంతు.. ఎస్‌ఐఆర్ ముసాయిదాపై విమర్శలు
బీఎల్‌ఓల తప్పిదాలతో వేలాది మంది ఓటర్లకు ఇబ్బందులు.. యాప్‌లో ఎన్యుమరేషన్ ఫారాల వివరాలు నమోదు చేయలేదని గుర్తింపు
హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత హైదరాబాద్‌లో ఓటర్లకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంటింటికీ పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లకు (బీఎల్‌ఓలు) సమర్పించినప్పటికీ.. పలువురి పేర్లు ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితాలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలోని పలువురు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు సైతం ఓటర్ జాబితాలో లేకపోవడం అధికార యంత్రాంగంలోనూ ఆందోళనకు కారణమైంది. ఫారాలు సమర్పించిన తర్వాత కూడా తమ పేర్లు ముసాయిదా ఓటర్ జాబితాలో ఎందుకు లేవన్న దానిపై వారు అధికారులను సంప్రదించగా.. సంబంధిత పోలింగ్ కేంద్రాల వివరాలను పరిశీలించిన అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఫారం ఇచ్చినా.. యాప్‌లో నమోదు కాలేదా?
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే పలువురు ఓటర్లు ఫారాలు సమర్పించినప్పటికీ.. వాటి వివరాలను కొందరు బీఎల్‌ఓలు యాప్‌లో నమోదు చేయలేదని పరిశీలనలో గుర్తించినట్లు సమాచారం.
దీంతో ఫారం సమర్పించినప్పటికీ సంబంధిత ఓటరు వివరాలు డిజిటల్ ప్రక్రియలో నమోదుకాకపోవడంతో ఎస్‌ఐఆర్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌లో పేరు కనిపించని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఫారం సమర్పించిన ఓటర్ల వివరాలు యాప్‌లో నమోదు కాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.
ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు కూడా గల్లంతు
సాధారణ ఓటర్లకే కాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎస్‌ఐఆర్ ముసాయిదా జాబితాలో కనిపించకపోవడం ఈ వ్యవహారం తీవ్రతను తెలియజేస్తోందని పలువురు అంటున్నారు.
ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఫారాలను సమర్పించినప్పటికీ పేర్లు జాబితాలో లేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో వివరాలను పరిశీలించినప్పుడు ఎన్యుమరేషన్ ఫారాలు మొబైల్ యాప్‌లో ఎంట్రీ కాలేదని గుర్తించినట్లు సమాచారం.
దీంతో సాధారణ పౌరులు సమర్పించిన ఫారాల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు మరింత బలపడుతున్నాయి.
బీఎల్‌ఓల తప్పిదాలతో ఓటర్లకు ఇబ్బందులు
ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో వేలాది మంది ఓటర్లు జీహెచ్‌ఎంసీ సర్కిల్, జోనల్, కేంద్ర కార్యాలయాలు, విచారణ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
తమ తప్పు లేకపోయినా.. పేరు ఓటర్ జాబితాలో లేకపోవడంతో మళ్లీ ప్రక్రియను పూర్తి చేయాల్సిన పరిస్థితి రావడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంటూ పలువురు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
మళ్లీ ఫారం-6 దరఖాస్తు చేసుకోవాలా?
ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు కనిపించని ఓటర్లు మళ్లీ ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఫారం-6 దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారం సమర్పించిన ఓటర్లను మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకునేలా చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బీఎల్‌ఓ తప్పిదం కారణంగా ఓటరు పేరు గల్లంతైతే.. ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఓటర్లు కోరుతున్నారు.
ఫారం సమర్పిస్తే పేరు ఉండాల్సిందే
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వాటిని పూరింపజేయడం, తిరిగి సేకరించడం కీలకమైన దశలు.
ఓటరు పూర్తి వివరాలతో ఫారం సమర్పించిన తర్వాత సంబంధిత వివరాలను నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సిబ్బందిపై ఉంటుంది.
అయితే పని భారం, సిబ్బంది కొరత లేదా ఇతర కారణాలతో కొందరు బీఎల్‌ఓలు ఫారాలను పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడం, సేకరణలో నిర్లక్ష్యం చేయడం, సేకరించిన ఫారాల వివరాలను యాప్‌లో నమోదు చేయకపోవడం వంటి సమస్యలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఫారం సమర్పించిన ఓటరు పేరు ముసాయిదా జాబితాలో లేకపోవడం సహజంగానే అనేక సందేహాలకు దారితీస్తోంది.
పూర్తి సమాచారం ఇచ్చిన వారికి కూడా నోటీసులా?
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా 2002 ఓటర్ జాబితాకు సంబంధించిన వివరాలు సమర్పించినప్పటికీ కొందరు ఓటర్లకు నోటీసులు జారీ అవుతున్నట్లు సమాచారం.
ఓటర్లు ఇచ్చిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడం వల్లే కొన్ని సందర్భాల్లో నోటీసులు జారీ అవుతున్నాయని అధికారులు వివరిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఓటరు పూర్తి సమాచారం అందించిన తర్వాత కూడా అది సక్రమంగా నమోదు కాకపోతే.. దాని ప్రభావం ఓటరుపైనే పడుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో 19.44 లక్షల పేర్లు గల్లంతు
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47.36 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఎస్‌ఐఆర్ ముసాయిదా జాబితాలో 27.95 లక్షల మంది ఓటర్ల పేర్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం.
దీంతో సుమారు 19.44 లక్షల ఓటర్ల పేర్లు ముసాయిదా ఓటర్ జాబితాలో కనిపించకుండా పోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఈ భారీ వ్యత్యాసంపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఇందులో ఎన్యుమరేషన్ ఫారాలు యాప్‌లో అప్‌లోడ్ కాకపోవడం వల్ల జాబితాలో చోటు దక్కని వారి సంఖ్య ఎంత? ఇతర కారణాల వల్ల తొలగించబడిన వారు ఎంతమంది? అనే అంశాలపై స్పష్టత అవసరం.
నోటీసులు వచ్చినా విచారణకు రాని ఓటర్లు
ముసాయిదా ఓటర్ జాబితా ప్రక్రియలో భాగంగా కొందరికి నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరయ్యేందుకు పలువురు ఓటర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అధికారులు పలు రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచిస్తున్నప్పటికీ.. అవసరమైన పత్రాలన్నీ అందుబాటులో లేకపోవడంతో కొందరు ఓటర్లు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
“ఓటు హక్కు కోసం ఇంత ప్రక్రియ ఎందుకు?” అనే భావనతో కొందరు వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని తెలుస్తోంది.
సాధారణ ఓటర్ల పరిస్థితిపై ఆందోళన
ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల పేర్లే ఓటర్ జాబితాలో లేకపోతే.. సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
ఎన్యుమరేషన్ ఫారం సమర్పించిన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా డిజిటల్ రికార్డులో నమోదయ్యాయా? ఫారం-6 అవసరం లేని వారికి మళ్లీ దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బీఎల్‌ఓ స్థాయిలో జరిగిన పొరపాట్లను ఎలా సరిచేస్తారు? అనే అంశాలపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఓటర్ల డిమాండ్ ఏమిటి?
ఫారం సమర్పించినట్లు ఆధారం ఉన్న ఓటర్ల పేర్లను ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితాలో పునఃపరిశీలించి చేర్చాలి అని పలువురు కోరుతున్నారు.
అలాగే బీఎల్‌ఓల స్థాయిలో ఫారాలు యాప్‌లో నమోదు కాకపోవడానికి కారణాలను గుర్తించి.. బాధ్యతను నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఓటరు చేసిన తప్పు లేకుండా కేవలం అధికారిక ప్రక్రియలో జరిగిన లోపం కారణంగా ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి రాకుండా చూడాలని వారు కోరుతున్నారు.
ఎస్‌ఐఆర్ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించే ప్రక్రియలో ఇలాంటి సమస్యలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
To get more interesting news, click the link below.
SIR Draft Voter List Telangana Names Missing Despite Enumeration Forms, GHMC Staff Families Also Affected

SIR Draft Voter List Telangana raises concerns as voters who submitted enumeration forms reportedly find their names missing; questions emerge over BLO data entry and mobile app uploads
Hyderabad: Questions are being raised over the SIR Draft Voter List Telangana after several voters reportedly found their names missing from the draft electoral roll despite submitting their enumeration forms.
The issue has reportedly affected not only ordinary voters but also family members of several employees associated with the GHMC Election Department. Despite submitting their forms with complete details, some voters were surprised to find that their names were absent from the SIR Draft Voter List.
When the details of the concerned polling stations were examined, it was reportedly found that some of the enumeration forms had not been entered into the designated mobile application.
The development has triggered concerns over the process of preparing the SIR Draft Voter List Telangana, particularly regarding the collection and digital uploading of enumeration forms by Booth Level Officers (BLOs).
Enumeration Form Submitted, But Name Missing From Voter List
Under the Special Intensive Revision (SIR) process, enumeration forms were distributed to households and collected after being filled in by voters. The responsibility for collecting and processing these forms rests with the concerned Booth Level Officers (BLOs).
However, allegations have emerged that some BLOs did not upload the details of forms submitted by voters into the mobile application.
As a result, voters who had completed and submitted their SIR enumeration forms are reportedly finding that their names do not appear in the SIR Draft Voter List Telangana.
This has raised a crucial question: If a voter submits the required enumeration form, why should the voter bear the consequences if the form is not entered into the system?
GHMC Election Department Employees Also Raise Questions
The issue has assumed significance because some employees working in the election machinery and their family members have reportedly faced similar problems.
People familiar with the election process are generally expected to have greater awareness of the documentation and enumeration procedures. Yet, if their submitted forms are not reflected in the SIR Draft Voter List, questions naturally arise about the situation faced by ordinary citizens.
The development has therefore intensified scrutiny of the SIR Draft Voter List Telangana and the manner in which enumeration data has been processed.
Voters Rush to GHMC Offices
After discovering that their names were missing from the draft voter list, thousands of voters are reportedly approaching GHMC circle offices, zonal offices, the central office and enquiry centres seeking clarification.
Many voters are questioning why they should spend their time visiting government offices when they had already completed the required procedure.
According to the information available, officials are advising some affected voters to submit a fresh Form-6 application for inclusion of their names as voters.
This has reportedly caused frustration among voters who say they had already submitted their enumeration forms.
“Why Should Voters Suffer for Staff Errors?”
The controversy has raised concerns over accountability in the preparation of the SIR Draft Voter List Telangana.
Voters who claim to have submitted their forms are questioning whether they should once again complete the registration process if their details were not uploaded by the concerned election staff.
The key issue is not merely whether a voter can submit Form-6 again, but whether voters who have already complied with the enumeration process should be required to repeat the procedure because of an alleged administrative or data-entry lapse.
Form Submitted With Complete Details Should Be Reflected
The SIR process requires enumeration forms to be distributed, completed and collected from eligible voters.
Once a voter submits the required form with complete information, the details are expected to be processed as part of the electoral-roll revision exercise.
However, reports that some submitted forms were not entered into the mobile application have created doubts over whether all collected forms were properly digitised before publication of the SIR Draft Voter List.
Where complete information has been provided, voters are questioning why their names should disappear from the draft electoral roll.
If information is incomplete or additional verification is required, the concerned voter can be asked to provide clarification or supporting documents. But the reported absence of names despite submission of forms has become a major point of concern.
2002 Electoral Roll Details Also Under Scrutiny
Another issue relates to voters who reportedly provided details linked to the 2002 electoral roll but have still received notices.
Officials are reportedly stating that notices were issued in some cases because the complete information provided by voters was not properly recorded.
This has created another layer of confusion among voters attempting to understand the status of their names in the SIR Draft Voter List Telangana.
19.44 Lakh Names Missing From Hyderabad Draft List
According to the figures cited in the information available, Hyderabad district had around 47.36 lakh voters, while the draft list reportedly contains approximately 27.95 lakh voters.
This means that around 19.44 lakh names are not appearing in the draft list.
The large difference has triggered questions about the reasons behind the exclusion.
Election department sources are reportedly indicating that the number of cases involving enumeration forms that were not uploaded into the application could run into lakhs.
However, the exact reasons for the exclusion of individual voters would need to be established through official verification.
Multiple Documents Required for Verification
Another concern being raised by some voters is the requirement to submit multiple documents during the verification process.
Officials are reportedly asking certain voters to submit three categories of documents.
For voters who do not have all the required documents readily available, the verification process can become difficult.
As a result, some voters may reportedly become reluctant to attend enquiry proceedings or may feel discouraged from pursuing the matter further.
SIR Draft Voter List Telangana: Questions Over Data Entry
The controversy has placed the role of BLOs in the SIR enumeration process under greater scrutiny.
The key questions being raised include:
- Were all enumeration forms distributed to households?
- Were all submitted forms collected by BLOs?
- Were the collected forms entered into the mobile application?
- How many submitted forms remain unuploaded?
- How many voters were excluded because of data-entry issues?
- Why are some voters being asked to submit Form-6 despite already submitting enumeration forms?
- What mechanism is available to correct genuine administrative errors?
- How many voters received notices despite submitting complete information?
- What happened to the enumeration data submitted by affected voters?
Answers to these questions could provide greater clarity on the preparation of the SIR Draft Voter List Telangana.
Voters Seek Correction Before Final Electoral Roll
With the draft electoral roll now under scrutiny, affected voters are seeking an opportunity to have their names verified and corrected before the final voter list is prepared.
The central concern among affected voters is that an administrative or data-entry error should not result in a genuine voter being left out of the electoral roll.
The controversy surrounding the SIR Draft Voter List Telangana therefore highlights the importance of ensuring that every submitted enumeration form is properly accounted for, digitally recorded and appropriately verified.
For voters whose names are missing, checking the official electoral-roll status and following the prescribed claims and objections or registration process remains important.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates
