నీటి పండ్లు.. పోషకాలు మెండు
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని ద్వారా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని నివారించేందుకు నిత్యం సరిపడా నీరు తాగటంతో పాటు వేసవిలో లభించే నీటి శాతం ఎక్కువ ఉండి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తరుచూ తినటం ద్వారా శరీరాన్ని చల్లబర్చటంతో పాటు ఇతర పోషకాలు సైతం అందుతాయని న్యూట్రిషీయన్స్ పేర్కొంటున్నారు.వేసవిలో కర్బూజను తరుచూ తీసుకోవటంతో శరీరం చల్లబడటంతో పాటు తక్షణ శక్తి అందుతుంది. మలబద్దకం, జీర్ణ సంబంధ సమస్యలను సైతం దూరం చేస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంచి ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. ఇక పండ్లలో రాజు మామిడి పండు వేసవిలో లభ్యమవుతుంది. వేసవిలో ఈ పండును తరుచూ తీసుకోవటంతో జీర్ణక్రియ మెరుగుపడటంతో పాలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఈ కాలంలో తప్పకుండా తినాల్సిన అసలైన పండు పుచ్చకాయ. దీనిలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వడదెబ్బ నుంచి రక్షిస్తోంది. మూత్రంలో కూడా మంటను తగ్గించటం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చటం వంటి మేలు జరుగుతుంది. నారింజ, ద్రాక్ష, అరటి పండ్లు, కీవీ, తాటి ముంజలు వంటి పండ్లను తరుచూ తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందే అవకాశాలున్నాయి.
To get more interesting news, click the link below.
Summer Fruits That Keep Your Body Cool, Hydrated, and Healthy

As temperatures continue to rise day by day, there is a high risk of dehydration due to the intense summer heat. This can increase the chances of falling ill. To prevent this, nutritionists suggest drinking sufficient water daily and regularly consuming summer fruits that contain high water content and rich nutrients. These fruits help cool the body and provide essential nutrition.
Eating muskmelon frequently during summer helps cool the body and provides instant energy. It also helps relieve constipation and digestive problems, boosts immunity, and reduces stress. Mango, known as the king of fruits, is another popular summer fruit. Doctors say that consuming mangoes regularly during summer improves digestion, lowers bad cholesterol levels, and helps maintain overall health.
Watermelon is considered one of the most important fruits to eat during this season. Since it contains a high percentage of water, it protects the body from heatstroke. It also helps reduce burning sensation during urination and improves heart health. Regularly consuming fruits like oranges, grapes, bananas, kiwi, and ice apples (palm fruit) can provide the body with essential nutrients needed during summer.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

