వైభవ్‌లా అవ్వాలని పిల్లాడిని నెట్స్‌లోకి లాక్కెళ్లిన తండ్రి.. వీడియో వైరల్
15 ఏళ్ల యువకుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. అతడు చిన్న వయస్సులోనే అద్భుతమైన బ్యాటింగ్ ప్రభావంతో కొన్ని ఆశ్చర్యకరమైన పర్యవసానాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సూర్యవంశీ ప్రభావం చిన్న వయసు ఆటగాళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఓ చిన్న పిల్లవాడిని అతడి తండ్రి బలవంతంగా నెట్స్ ప్రాక్టీస్‌కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.వీడియోలో 10 ఏళ్ల ఒక బాలుడు నెట్స్‌లో సీనియర్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ప్యాడ్లు ధరించి ఉన్నాడు. ఆ బాలుడు భయపడుతూ.. ‘వద్దు, నేను ఆడను, నాకు గాయాలవుతాయి’ అని తన తండ్రికి చెప్పాడు. అయినప్పటికీ సదరు వ్యక్తి బాలుడి చేయి పట్టుకుని బలవంతంగా నెట్స్ వైపు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పిల్లలకు ఆట నేర్పించడం మంచిదే కానీ, వారి ఆవేదనను కూడా తల్లిదండ్రులు అర్థ చేసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.వైభవ్ సూర్యవంశీకి ఆటపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటివి ఉన్నాయి కాబట్టి.. చిన్న వయస్సులోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి… రాణిస్తున్నాడు. అలానే చాలా మంది పిల్లలు కూడా క్రికెట్లో సత్తాచాటేందు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు, కోచ్‌లు పిల్లలకు తగినంత మానసిక మద్దతు, ఆటలో సానుకూల అనుభవాన్ని ఇచ్చే విధంగా ప్రేరేపించడం ముఖ్యమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
To get more interesting news, click the link below.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

