NewsPolitics

పరిగి అసెంబ్లీలో బీజేపీకి నాయకత్వ సంక్షోభం.. కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి

పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ బలపడుతున్నా నాయకత్వ లోపం

పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నాయకత్వ లోపం (BJP Faces Leadership Crisis in Pargi) తీవ్రంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, పరిగి నియోజకవర్గంలో మాత్రం పార్టీని సమర్థంగా నడిపించే బలమైన నాయకుడు లేకపోవడం కార్యకర్తల్లో ఆందోళనకు కారణమవుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం లేకపోయినా కమలం గుర్తుకు 16 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. అంతేకాకుండా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించింది. ఇది నియోజకవర్గంలో పార్టీ బలపడుతున్న సంకేతంగా భావిస్తున్నారు.

పురపాలక ఎన్నికల్లోనూ బీజేపీ ఉనికి

ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో కూడా బీజేపీ తన ఉనికిని చాటింది. రెండు వార్డుల్లో పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. కొందరు అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొత్తం పోలైన ఓట్లలో తొమ్మిది శాతం (1,659 ఓట్లు) సాధించడం పార్టీ ఎదుగుదలకు సంకేతమని విశ్లేషకులు అంటున్నారు.

గతంలో పరిగి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సాధారణంగా పది వేలలోపే ఓట్లు వచ్చేవి. అయితే ప్రస్తుతం పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఎవరికివారే కన్వీనర్లు.. పార్టీలో గ్రూపు రాజకీయాలు

పార్టీ జిల్లా కన్వీనర్‌గా ఉన్న కరణం ప్రహ్లాద్‌రావు పరిగికి చెందినవారే అయినప్పటికీ, ఆయన నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించడం లేదని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అలాగే చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తన పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పరిగిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు.

నాయకత్వ లోపంతో పాటు ద్వితీయ శ్రేణి నాయకుల్లో గ్రూపు రాజకీయాలు పెరగడం కూడా పార్టీకి నష్టంగా మారుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ కన్వీనర్‌గా ఇద్దరు, ముగ్గురు నాయకులు తామే కన్వీనర్ అని చెప్పుకుంటూ గ్రూపులుగా కొనసాగుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

పరిగిలో పనిచేస్తున్న బీజేపీ నాయకులు

పరిగి నియోజకవర్గంలో ప్రస్తుతం వేముల పెంటయ్య, ఏవీ రాములు, జి. శ్రీనివాస్, ఘణపూర్ వెంకటయ్య గౌడ్, రాముయాదవ్, బి. రాంచందర్ వంటి నాయకులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బి. మారుతికిరణ్ పోటీ చేశారు. అలాగే కేఎస్సార్ ట్రస్ట్ చైర్మన్ కె. శరత్‌కుమార్ రెడ్డి కూడా నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇటీవల బృంగి హరికృష్ణ కూడా బీజేపీలో చేరారు.

పార్టీ బలపడుతున్న సమయంలో ఐక్యత అవసరం

పరిగి నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా బలపడుతున్నప్పటికీ, నాయకత్వ లోపం మరియు గ్రూపు రాజకీయాలు పార్టీ భవిష్యత్తుకు అడ్డంకిగా మారే అవకాశముందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అభివృద్ధికి ఒక బలమైన నాయకత్వం అవసరమని వారు సూచిస్తున్నారు.

To get more interesting news, click the link below.

Telangana TV

BJP Faces Leadership Crisis in Pargi Assembly Constituency

Lack of Strong Leadership Worries BJP Workers in Pargi

The Bharatiya Janata Party (BJP) is reportedly facing a leadership crisis in the Pargi Assembly constituency of Telangana. Despite favorable political conditions for the party at the national level, local BJP workers say the absence of a strong leader to guide the party in Pargi has created confusion among the cadre.

Interestingly, the BJP secured over 16,000 votes in the last Assembly elections in the constituency even without an aggressive campaign. In the recent Lok Sabha elections, the party reportedly received more votes than the Congress in the Pargi segment, indicating a gradual rise in its support base.

BJP Shows Presence in Municipal Elections

The party also managed to demonstrate its presence in recent municipal elections in the area. BJP candidates put up a tough fight in two wards, with some losing by narrow margins. Overall, the party secured around nine percent of the total votes (1,659 votes), which observers say reflects the growing support for the BJP in the constituency.

In earlier Assembly elections, the BJP used to receive less than 10,000 votes in Pargi. However, recent election results suggest that the party’s vote share is slowly increasing.

Multiple Leaders Claiming to be Conveners

Party workers say the lack of clear leadership and internal group politics are becoming major concerns. District convener Karanam Prahlad Rao, who belongs to Pargi, is reportedly not focusing much on the constituency. Similarly, Chevella MP Vishweshwar Reddy is also said to be paying limited attention to Pargi among the seven constituencies in his parliamentary segment.

Due to the absence of strong leadership, several second-level leaders have formed groups within the party. Reports indicate that two or three leaders are claiming themselves as Assembly conveners, leading to internal confusion and factionalism.

Local Leaders Active in the Constituency

Several BJP leaders including Vemula Pentayya, AV Ramulu, G. Srinivas, Ghanpur Venkatayya Goud, Ramu Yadav, and B. Ramchander are currently active in party activities in the constituency.

In the previous Assembly elections, B. Maruthi Kiran contested as the BJP candidate. Meanwhile, KSR Trust Chairman K. Sharath Kumar Reddy has also been actively working in the constituency. Recently, Brungi Harikrishna joined the BJP, adding to the party’s local leadership.

Need for Unity in a Growing Party

While the BJP appears to be gradually strengthening its base in the Pargi Assembly constituency, many party workers feel that BJP Faces Leadership Crisis in Pargi, which could slow down the party’s progress in the region.

Local leaders say that although the party’s vote share has increased in recent elections, BJP Faces Leadership Crisis in Pargi due to the absence of a strong and unified leader who can guide party activities effectively.

Several workers believe that internal group politics are also contributing to the situation, and BJP Faces Leadership Crisis in Pargi as different factions attempt to assert influence within the constituency.

Party cadres say that unless these internal issues are resolved soon, BJP Faces Leadership Crisis in Pargi could become a major obstacle to the party’s future growth and electoral prospects.

They also emphasized that to overcome this situation where BJP Faces Leadership Crisis in Pargi, the party leadership must ensure better coordination, appoint a clear leader, and strengthen organizational unity in the constituency.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *