NewsTrendy

తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు… షాద్‌నగర్‌లో డ్రగ్ ల్యాబ్

తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న గ్యాంగ్ కార్యకలాపాలను ఈగిల్ ఫోర్స్ దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది.

దర్యాప్తులో భాగంగా ఎస్సార్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా డ్రగ్స్ తయారీలో ఉపయోగించే నిషేధిత రసాయనాలను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా మెఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 2 బ్రోమో-4 మెథైల్ ప్రోపియోఫీనోన్ మరియు క్లోఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 3 క్లోరో-1 ఫెనైల్-1 ప్రోపనోన్ వంటి కెమికల్స్‌ను సరఫరా చేసినట్లు వెల్లడించారు.

ఈ వ్యవహారంలో ఎస్సార్ ఇన్నోవేషన్స్ డైరెక్టర్ షేక్ రఫీ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఇండియా మార్ట్ వేదికగా రాజస్థాన్‌కు చెందిన నిందితులకు ఈ రసాయనాలను సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన గ్యాంగ్ మూడు విడతల్లో దాదాపు 300 కిలోల రసాయనాలను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

నిందితులు తప్పుడు కంపెనీ పేర్లతో కెమికల్స్ కొనుగోలు చేసి షాద్‌నగర్‌లో అద్దె గదిని తీసుకుని అక్కడే డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తయారుచేసిన డ్రగ్స్‌ను తిరిగి రాజస్థాన్‌కు తరలించి అక్కడ విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ గ్యాంగ్‌కు రాజస్థాన్‌కు చెందిన గిరీష్ థాపర్ అలియాస్ వీరేంద్ర స్వామి నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. అతడితో పాటు మనీష్ బిష్ణోయి, మనోజ్ మాథూర్, శిశుపాల్, సుమీత్, రాజు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. కెమికల్స్ సరఫరాకు సంబంధించి లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈగిల్ పోలీసుల సమాచారంతో రాజస్థాన్ పోలీసులు వీరేంద్ర స్వామి, మనీష్ బిష్ణోయిని అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో షాద్‌నగర్‌లో నడుస్తున్న డ్రగ్ ల్యాబ్ విషయం బయటపడింది. అనంతరం హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులపై NDPS చట్టం సెక్షన్లు 21(C), 27A, 29, 30 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

To get more interesting news, click the link below.

Telangana TV

Telangana Breaking News: Synthetic Drug Racket Busted in Shadnagar

In a major Telangana breaking news development, police have uncovered a large synthetic drugs racket in Telangana. Authorities discovered a secret mephedrone drug lab in Telangana operating in Shadnagar during an investigation carried out by the Eagle Force. The shocking revelations have put the police department on high alert and sparked discussions across Telangana news today and Hyderabad news platforms.

During the investigation, police found that a company named SSR Innovations was allegedly supplying banned chemicals used in the production of synthetic drugs. These chemicals include 2-bromo-4-methylpropiophenone, used in the production of mephedrone, and 3-chloro-1-phenyl-1-propanone, used to manufacture clephedrone. Authorities confirmed that these chemicals were illegally supplied to the drug manufacturing network.

According to the police, Sheikh Rafi, director of SSR Innovations, played a key role in the supply chain. Investigators revealed that the chemicals were sold through the online marketplace IndiaMART to suspects based in Rajasthan. Reports suggest the Rajasthan gang purchased nearly 300 kilograms of chemicals in three separate consignments, making it a major Hyderabad narcotics police case now trending across Telangana live updates and TS latest updates.

Police investigations further revealed that the accused used fake company identities to purchase the chemicals. They rented a room in Shadnagar where they secretly established a mephedrone drug lab and manufactured synthetic drugs. The finished drugs were then transported back to Rajasthan for distribution and sale, making it a major Shadnagar drug racket highlighted in latest Telangana news today.

The gang is reportedly led by a Rajasthan-based accused Girish Thapar alias Virendra Swami. Other members involved include Manish Bishnoi, Manoj Mathur, Shishupal, Sumit, and Raju, who played key roles in the illegal operations. Officials also confirmed that the supply of chemicals involved financial transactions worth several lakhs of rupees.

Following information shared by the Eagle Force, Rajasthan police detained Virendra Swami and Manish Bishnoi. During interrogation, they revealed details about the illegal drug manufacturing setup in Shadnagar. Based on this information, the Hyderabad Narcotics Police registered a case and launched a full-scale investigation, which is now widely reported across Hyderabad drug lab news, Hyderabad local news, and Hyderabad Telangana news live.

Police have registered a case under NDPS Act sections 21(C), 27A, 29, and 30. Authorities are currently searching for other suspects connected to the network. This Telangana police drug bust has become a major highlight in Telangana district news today, Telangana news live, and Telangana breaking news live updates.

The incident is receiving wide coverage in Telangana news paper, mana Telangana news, Telangana news today in English, and Telugu news Telangana, as authorities continue their crackdown on drug trafficking. Officials say more arrests are likely as the investigation progresses, making it one of the biggest latest news from Telangana state related to narcotics enforcement and Telangana government news today.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *