Devotional

ఈ రోజు గనుక కైలాన నాధుడిని దర్శించుకుంటే..

ఈ రోజు గనుక కైలాన నాధుడిని దర్శించుకుంటే..

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం ప్రారంభమవడంతో శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. పైగా సోమవారం రోజున కార్తీక మాసం మొదలవడంతో దీనికి మరింత విశిష్ఠత నెలకొంది. కార్తీక మాసంలో సోమవారం అంటే పరమ శివుడికి ఇష్టమైన రోజు అని..ఈ రోజు గనుక కైలాన నాధుడిని దర్శించుకుంటే.. కోరికలు తప్పకుండా తీరుతాయని భక్తుల నమ్మకం..

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ద్రాక్షారామం, అమరావతి, భీమవరం, పాలకొల్లు శ్రీశైలం, మహానంది,యాగంటి, శ్రీకాళహస్తి, తిరుపతి కపిలతీర్థం శైవక్షేతాల్లో అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే వేములవాడ, కీసర, వరంగల్ వేయిస్తంభాల గుడి దేవాలయాల్లో పరమ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 2గంటలకే ఆలయ ద్వారాలు తెరిచారు. పరమశివుడికి పాలభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణంతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *