గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం – చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, విజేతల పూర్తి జాబితా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 (Gaddar Film Awards 2026) ను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో తెలుగు సినీ పరిశ్రమలో, అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రకటించడం సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.
గత ఏడాది ప్రారంభమైన గద్దర్ సినీ అవార్డులు ఈసారి మరిన్ని ప్రతిష్ఠాత్మక విభాగాలతో నిర్వహించడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో ఈ గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టింది. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ సినీ అవార్డుల సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించడంతో సినీ కళాకారులకు ఇది పెద్ద ప్రోత్సాహంగా మారింది.
ఈ ఏడాది ఉగాది పర్వదినం (మార్చి 19) సందర్భంగా హైదరాబాద్‌లో సినీ తారల సందడితో ఈ అవార్డుల వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ విజేతలను ఎంపిక చేసింది.
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 – స్పెషల్ అవార్డులు
- ఎన్టీఆర్ జాతీయ అవార్డు – చిరంజీవి
- రఘుపతి వెంకయ్య అవార్డు – రమేశ్ ప్రసాద్
- పైడి జయరాజ్ అవార్డు – కమల్ హాసన్
- నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనీదత్
- ఏఎన్ఆర్ అవార్డు – జయసుధ
- టీఎల్. కాంతారావు అవార్డు – ఆర్. నారాయణ మూర్తి
- సి. నారాయణ రెడ్డి అవార్డు – సుద్దాల అశోక్ తేజ
- బీఎన్ రెడ్డి అవార్డు – సింగీతం శ్రీనివాసరావు
ఫీచర్ ఫిల్మ్స్ – గద్దర్ అవార్డ్స్ విజేతలు
- ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
- ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
- ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
- ఉత్తమ నటుడు – నాగచైతన్య (తండేల్)
- ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్)
- ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ – తండేల్
- ఉత్తమ సందేశాత్మక చిత్రం – కోర్ట్
- ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
- ఉత్తమ నూతన దర్శకుడు – సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
- ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
ఇతర ముఖ్య విభాగాల విజేతలు
- ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)
- ఉత్తమ సహాయ నటి – భూమిక (యుఫోరియా)
- ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ రాబిన్ (దండోరా)
- ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ గాయని – సాహితీ చాగంటి (కన్నప్ప)
- ఉత్తమ బాలనటుడు – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
- ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)
- ఉత్తమ స్క్రీన్ ప్లే – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
- ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
- ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
- ఉత్తమ కొరియోగ్రాఫర్ – సందీప్ (ఛాంపియన్)
- ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – తోటతరణి (ఛాంపియన్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవిందరాజు (అఖండ-2)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ (ఛాంపియన్)
- ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ – పీటర్ హెయిన్స్ (ఛాంపియన్)
స్పెషల్ జ్యూరీ అవార్డులు
- శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్)
- చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
- రోషన్ మేక (ఛాంపియన్)
- అనంతిక (8 వసంతాలు)
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 విజేతల జాబితాపై సినీ పరిశ్రమ నుంచి భారీగా స్పందన వస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వ సినీ అవార్డులు రావడం వల్ల తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద ప్రోత్సాహం లభిస్తుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఉగాది సందర్భంగా జరిగే ఈ అవార్డుల వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
To get more interesting news, click the link below.
Telangana Government Announces Gaddar Film Awards 2026 – Chiranjeevi Honored with NTR National Award
The Telangana government has officially announced the Gaddar Film Awards 2026, bringing excitement to the Telugu film industry. The prestigious Telangana film awards recognize outstanding contributions to cinema and celebrate the achievements of artists who have made a mark in Telugu cinema. One of the biggest highlights of this year’s awards is that legendary actor Chiranjeevi receives the NTR National Award in 2026, honoring his decades-long contribution to the film industry.
The announcement of the Gaddar Film Awards 2026 winners list has created a buzz across the Tollywood awards circuit, with several actors, filmmakers, and technicians being recognized for their exceptional work. These awards are considered one of the most prestigious Telangana government awards in the field of cinema.
Chiranjeevi Receives NTR National Award
Among the major recognitions, the NTR National Award given to Chiranjeevi stands out as a moment of pride for the Telugu film industry. Known for his remarkable acting career and social contributions, Chiranjeevi has played a key role in shaping modern Telugu cinema.
Many fans and film personalities have welcomed the decision, saying the honor reflects the actor’s decades of dedication to entertainment and cultural influence. The recognition has also sparked discussions about why Chiranjeevi received the NTR National Award, with industry experts highlighting his versatility, leadership, and continued support for the film fraternity.
Full Winners List of Gaddar Film Awards 2026
The full winners list of Gaddar Film Awards 2026 includes several notable names from the Telugu film industry. Actors, directors, music composers, and technicians have been recognized for their creative excellence.
The Telangana state film awards 2026 winners represent the best achievements in cinema over the past year. The awards aim to encourage creativity and innovation in filmmaking while supporting the growth of the Telugu film industry awards in Telangana.
What Are Gaddar Film Awards?
Many movie lovers are curious about what are Gaddar Film Awards and their significance. The awards are named in honor of the legendary poet and revolutionary singer Gaddar, who symbolized cultural expression and social awareness.
The history of Telangana state film awards reflects the state’s commitment to recognizing artistic talent in cinema. Through these awards, the government celebrates not only actors but also the creative professionals who work behind the scenes.
Importance of Film Awards in Telugu Cinema
The importance of state film awards in Telugu cinema goes beyond recognition. These awards motivate filmmakers and artists to produce quality content that reflects social values, culture, and innovation.
The Telangana government film awards details show that the state is committed to promoting cinema as an important cultural industry. Events like the Hyderabad film awards ceremony also bring together artists and fans, strengthening the bond between cinema and society.
A Proud Moment for Tollywood
The announcement of the Telangana Gaddar Film Awards news has become one of the most talked-about topics in Hyderabad Telugu film industry news. The awards not only celebrate cinematic excellence but also highlight the growth of the Tollywood awards in Hyderabad.
As the Telangana state film awards 2026 winners are celebrated, the event stands as a reminder of the vibrant creativity within the Telugu film industry. With legendary personalities like Chiranjeevi being honored, the awards continue to inspire future generations of filmmakers and artists.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.


Pingback: UPSC Civil Services Results 2026 : Anuj Agnihotri Secures Rank 1