NewsPolitics

క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు

మంచిర్యాల, మార్చి 06:(సత్య తెలంగాణ) క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై నెలకొన్న వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఆ సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అతడికి రిమాండ్ విధించింది. తర్వాత బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్‌పై విడుదలైన అనంతరం క్యాతనపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్, స్థానిక ఎంపీ వంశీ కృష్ణ మరియు ఎమ్మెల్యే వివేక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను జైల్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పోలీసులపై కూడా మండిపడ్డారు.

గత ఫిబ్రవరి 11న తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 14న ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన తర్వాత మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు జరిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా క్యాతనపల్లిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం మూడు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

To get more interesting news, click the link below.

Telangana TV

Satya Telangana Newspaper – Latest Telangana News Updates

Satya Telangana Newspaper brings you the latest Telangana news, covering important updates from across the state. Stay informed with Telangana news today, including politics, government decisions, public issues, and development updates.

Our platform provides Telangana news live with fast and reliable reporting. Readers can access Telangana news in Telugu as well as Telangana news in English, making it easier for everyone to stay connected with current events.

From Hyderabad news and district-level updates to breaking political developments, Satya Telangana Newspaper ensures accurate and timely coverage. We also bring stories related to Mana Telangana news, highlighting regional issues, local governance, and community developments.

Follow Satya Telangana Newspaper for daily Telangana news updates, breaking stories, and in-depth coverage from Hyderabad and across Telangana.

Stay connected with Satya Telangana news today for trusted journalism and real-time updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *