సామాన్యులకు ధైర్యం.. నేరస్థులకు భయం: సైబరాబాద్ పోలీసుల ‘ఫుట్ ప్యాట్రోలింగ్’
సామాన్య ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను ముందుగానే అరికట్టడం లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలినడకన గస్తీ (ఫుట్ ప్యాట్రోలింగ్) నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు.
జనసంచారం అధికంగా ఉండే ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్లు, నివాస కాలనీలు, చిన్న చిన్న వీధుల్లో పోలీసులు పర్యటిస్తూ స్థానిక పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ప్యాట్రోల్ కార్లు, బ్లూ కోల్ట్ సిబ్బంది తమ వాహనాలను నిలిపివేసి కాలినడకన తిరుగుతూ అనుమానాస్పద కదలికలను గమనిస్తున్నారు.
ప్రజలతో మాట్లాడి, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రజల్లో భద్రతా భావన పెరుగుతుండగా, నేరస్థుల్లో భయం నెలకొంటోంది.
ఫుట్ ప్యాట్రోలింగ్ లక్ష్యం ఇదే
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, అవసరమైతే తనిఖీలు నిర్వహించడం ప్రధాన లక్ష్యంగా పోలీసులు చెబుతున్నారు.
రాత్రి వేళల్లో ప్రజల్లో ధైర్యం పెంచడమే కాకుండా, నేరాలకు ముందుగానే అడ్డుకట్ట వేయడం కూడా దీని ముఖ్య ఉద్దేశం. స్థానికులతో నేరుగా మాట్లాడటం ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థ మరింత బలపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఫుట్ ప్యాట్రోలింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు
నేరాల కట్టడి
వాహనాలు వెళ్లలేని చిన్న వీధులు, సందుల్లో కూడా పోలీసులు తిరగడం వల్ల అసాంఘిక కార్యకలాపాలను గుర్తించే అవకాశం ఉంటుంది.
ప్రజలతో మమేకం
రాత్రివేళల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులతో పోలీసులు నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
అప్రమత్తత పెంపు
అనుమానాస్పద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. అవసరమైతే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నారు.
వివరాల సేకరణ
రాత్రి వేళల్లో కారణం లేకుండా తిరిగే వ్యక్తులు, పాత నేరస్థుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం సేవించడం వంటి చర్యలపై కూడా నిఘా పెంచుతున్నారు.
వాహన తనిఖీలు
నంబర్ ప్లేట్ సరిగా లేని లేదా అనుమానాస్పదంగా కనిపించే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
శారీరక దారుఢ్యం
కాలినడకన గస్తీ నిర్వహించడం వల్ల పోలీసు సిబ్బందిలో శారీరక చురుకుదనం పెరుగుతోంది.
ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది
ప్రజల మధ్య తిరగడం వల్ల పోలీసులపై విశ్వాసం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. స్థానికులతో స్నేహపూర్వకంగా మాట్లాడటం ద్వారా కొన్ని సందర్భాల్లో నేరాలకు సంబంధించిన ముందస్తు సమాచారం కూడా అందుతుందని వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితుల పరిశీలన
వాహనాల్లో పర్యటిస్తే కేవలం పైపైన పరిస్థితులు మాత్రమే కనిపిస్తాయని, కానీ కాలినడకన తిరిగితే క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
దుండిగల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. సతీష్ మాట్లాడుతూ, “ప్రజల్లో నమ్మకం పెంచడం, నేరాలను ముందుగానే అరికట్టడం కోసం కాలినడక గస్తీని నిరంతరం కొనసాగిస్తాం” అని తెలిపారు.
వృత్తిపరమైన సంతృప్తి
దుండిగల్ ఎస్ఐ రామ్మోహన్ మాట్లాడుతూ, “కేవలం నేరగాళ్లను పట్టుకోవడమే కాకుండా, సామాన్య ప్రజలకు రక్షణగా నిలుస్తున్నామనే భావన సంతృప్తినిస్తుంది. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇస్తున్నారు. ఇది నేరాల నివారణకు ఎంతో ఉపయోగపడుతోంది” అని చెప్పారు.
ప్రజలకు మరింత దగ్గరగా పోలీసులు
కానిస్టేబుల్ కె. సాయికుమార్ మాట్లాడుతూ, “కాలినడక గస్తీ వల్ల వాహనాలు వెళ్లలేని సందుల్లో కూడా మేము వెళ్లగలుగుతున్నాం. ఇళ్ల తాళాలు సరిగ్గా ఉన్నాయా, ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా వంటి విషయాలను గమనించగలుగుతున్నాం. దీంతో నేరాలను ముందుగానే అరికట్టే అవకాశం ఉంటుంది” అని తెలిపారు.
To get more interesting news, click the link below.
Cyberabad Police Foot Patrolling Boosts Public Safety in City Areas
In an effort to strengthen security and build confidence among residents, the Cyberabad Police have intensified their foot patrolling for public safety across several areas under the Cyberabad Commissionerate. The initiative is aimed at ensuring safety for citizens while also sending a strong message to those involved in criminal activities.
According to officials, the police foot patrol to control crime in Cyberabad has been increased in busy localities, residential colonies, and public spaces. These patrols are part of a broader strategy to maintain law and order while improving interaction between police officers and the community.
Security Patrol in Key Areas
The security patrol by Cyberabad police in city areas is being conducted both during the day and at night. Officers are regularly visiting markets, bus stops, and crowded locations to monitor activities and respond quickly to any suspicious behavior.
As part of the initiative, the Cyberabad police strengthening night patrol has become an important step to prevent crimes such as theft, chain snatching, and other disturbances that often occur during late hours.
Officials say this police foot patrol initiative for crime prevention not only helps reduce criminal activity but also creates a sense of security among residents and business owners.
Importance of Police Foot Patrolling
Many citizens often ask what is police foot patrolling and why it is important. Foot patrolling involves police officers walking through neighborhoods and public areas instead of only using vehicles. This method allows officers to observe their surroundings more closely and interact directly with the public.
Experts highlight the importance of police patrol in cities, especially in rapidly growing urban areas like Hyderabad. Regular patrols help police maintain visibility, which discourages criminal behavior and improves overall public safety.
Role of Police in Crime Prevention
The role of police in crime prevention is crucial for maintaining peace and security in society. By increasing patrol activities and engaging with local communities, police can quickly identify potential threats and take action before crimes occur.
The benefits of police foot patrol include better communication with residents, faster response to incidents, and improved trust between the public and law enforcement agencies.
Strengthening Public Confidence
Recent Cyberabad police news highlights how authorities are focusing on proactive measures to ensure safety. The Hyderabad police patrol initiatives are part of a broader plan to enhance security across the city.
Under the Cyberabad commissionerate security measures, officers are also encouraging citizens to cooperate with police by reporting suspicious activities. These efforts are regularly featured in Hyderabad city police updates, reflecting the department’s commitment to public safety.
Through consistent patrols and community engagement, the Cyberabad Police aim to create a safer environment where citizens feel protected and criminals think twice before committing any unlawful act.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

