తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ మరియు వేం నరేందర్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గురువారం అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికు వీరు తమ నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరై అభ్యర్థులకు మద్దతు తెలిపారు.
సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, వేం నరేందర్ రెడ్డి నాలుగు సెట్లు సమర్పించారు. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం. అవి లేకుండానే సాయి నామినేషన్ సమర్పించడంతో అది తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
గురువారంతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అనంతరం ఎన్నికల అధికారి నామినేషన్లను పరిశీలించనున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు అయిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో, ఈ ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం త్వరలో ముగియనుంది. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆయనకు అవకాశం కల్పించింది.
ఇక మరో రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. దాదాపు 16 మంది ఈ స్థానానికి ఆసక్తి చూపారు. చివరకు ఈ పదవికి వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారైంది. దీనిపై తుది నిర్ణయం కోసం సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. చివరకు అధిష్ఠానం వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది.
ఇలా తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లే ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఇప్పుడు అధికారిక ప్రక్రియ పూర్తవడమే మిగిలింది.
To get more interesting news, click the link below.
Singhvi, Vem Narender Reddy File Rajya Sabha Nomination from Telangana
Political developments in the state have gained attention as Abhishek Manu Singhvi and Vem Narender Reddy officially filed their Rajya Sabha nomination from Telangana. The move has generated interest among political observers and party workers, making it one of the key highlights in Telangana political news.
The nominations mark an important step in the upcoming Rajya Sabha elections, where members are chosen to represent states in the Upper House of Parliament. With these nominations, discussions around Telangana Rajya Sabha election updates have intensified across political circles.
Key Candidates from Telangana
Senior Congress leader Abhishek Manu Singhvi, a well-known legal expert and parliamentarian, has been nominated to Rajya Sabha from Telangana. Along with him, Vem Narender Reddy Rajya Sabha nomination news has also drawn attention among party supporters and political analysts.
Both leaders are expected to represent the state in Parliament if elected, strengthening the voice of Telangana at the national level. Their nominations are also seen as an important development for the Congress candidates for Rajya Sabha from Telangana.
Importance of Rajya Sabha Representation
The Rajya Sabha seats from Telangana play a crucial role in representing the interests of the state at the national level. Members of the Upper House contribute to legislative debates, policy discussions, and decisions affecting the country.
Many citizens are curious about how Rajya Sabha members are elected. Unlike general elections where people vote directly, Rajya Sabha members are elected by the elected representatives of state legislative assemblies.
The role of Rajya Sabha members includes reviewing and debating laws, discussing national policies, and representing the concerns of their respective states in Parliament.
Political Reactions and Public Interest
The latest Rajya Sabha members nomination from Telangana has sparked discussions across political parties and public forums. Supporters believe the nominations will strengthen the state’s representation in national politics.
These developments are widely covered in Hyderabad political updates, as the city continues to be the center of major political activities in the state. Analysts say the nominations reflect ongoing strategies within Telangana politics as parties prepare for future political challenges.
Growing Interest in Telangana Politics
With the announcement of these nominations, the upcoming Rajya Sabha elections in Telangana have become a major topic of discussion among political observers. Leaders and party members are closely watching the developments as the election process moves forward.
As the story continues to unfold, it remains a key part of Telangana Congress news, highlighting the evolving political landscape of the state and the importance of strong representation in the national Parliament.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

