JobsNews

వికారాబాద్‌లో మార్చి 5న జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు మంచి అవకాశం లభిస్తోంది. వికారాబాద్ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీ గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

వికారాబాద్ జిల్లా ఐటీఐ క్యాంపస్‌లోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుంది. ఇందులో శుభగృహ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న సుమారు 30కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్ పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోనే ఉద్యోగం కల్పించనున్నారు.

ఈ ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ వంటి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు. జాబ్ మేళా ద్వారా ఎంపికైన వారికి నేరుగా ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్‌ను 9676047444 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *