NewsViral

మఠంలోనే నటితో స్వామిజీ రాసలీలలు

swamiji-sex-scandal-with-actress

మరో దిగ్భ్రాంతి కలిగించిన ఘటన వెలుగు చూసింది. కర్ణాటకలో ఓ స్వామిజీ రాసలీలలు వెలుగులోకి రావటంతో పెను కలకలమే చెలరేగింది. నంజేశ్వర స్వామిజీ అలియాస్‌ దయానంద్‌ ఓ యువతితో అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియో స్థానిక మీడియాలో వైరల్ అవుతోంది.

ఎల్హంక ప్రాంతంలోని మద్దెవనపుర మఠ ఆశ్రమంలో ఇది చోటు చేసుకున్నట్లు సమాచారం. పైగా వీడియోలో ఉంది ఓ నటి అని తెలుస్తోంది. పర్వతరాజ్‌ శివాచార్య స్వామి నుంచి వారసత్వంగా బాధ్యతలు తీసుకున్న తనయుడు నంజేశ్వర స్వామిజీగా ప్రస్తుతం మఠ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. సీక్రెట్‌ కెమెరాలతో ఆయన భాగోతాన్ని బయటపెట్టారు. నటికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటికే మఠానికి సంబంధించి భూముల అవకతవకల్లో ఆయన హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా ఉదంతంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే దయానంద్‌ రాసలీలలు కొత్తేం కాదని ఆయన అనుచరులే చెబుతుండగా.. ట్రస్ట్ సభ్యులు దయానంద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు కన్నడ మీడియాలో హల్ చల్‌ చేస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *