Janapadalu

జియో కి షాక్ ఇచ్చిన BSNL&MICROMAX !తక్కువ ధర లో మొబైల్ తో పాటు డేటా!

టెలికాం మార్కెట్‌లో దిగ్గజ నెట్వర్క్ లకు చుక్కలు చూపించిన రిలయన్స్‌ జియోకు చెక్‌ పెట్టడానికి దిగ్గజ కంపెనీలన్నీ ఒక దాని తరవాత ఒకటి పధకాలు రచిస్తున్నాయి. జియో అంటే.. దానికి మించిన ఆఫర్ తో కొత్త ఫోన్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రకటించినట్లుగా ఎయిర్ టెల్ 4G స్మార్ట్ ఫోన్ ధరను నిర్ణయించింది.ఈ రెండూ ఇంకా పూర్తిగా మార్కెట్ లోకి రాకుండానే.. ప్రభుత్వ రంగ సంస్థ BSNL  సంచలనం చేసింది. మెక్రోమ్యాక్స్ కంపెనీతో కలిసి 4G ఓల్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. కేవలం రూ.2,200తో ధరలో ఈ ఫోన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 20వ తేదీ అంటే శుక్రవారం నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయని తెలిపింది బీఎస్ఎన్ఎల్. భారత్ వన్ పేరుతో లాంఛ్ చేస్తోంది. 97 రూపాయలకే అన్ లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్ సౌకర్యం ,BSNL రూ.97 ఆఫర్ ఇస్తోంది. అన్ లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ ఉంటుంది.ఇస్తుంది.భారత్ 1 ఫీచర్స్:4G ఓల్ట్ ఫోన్. న్యూమరికల్ కీ ప్యాడ్. 2.4 ఇంచ్ స్క్రీన్. క్వాల్ కామ్ 205 ప్రాససర్. 512 MB ర్యామ్. 2 మెగా ఫిక్సల్ కెమెరా. VGA సెల్ఫీ కెమెరా. 2000mAH బ్యాటరీభారత్ 1 ఫోన్ 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తోంది. మైక్రోమ్యాక్స్ ఎంటర్ టైన్ మెంట్ యాప్ ఇన్ బిల్ట్ గా ఇన్ స్టాల్ అయ్యి ఉంటుంది. ఇందులో లైవ్ టీవీ, మ్యూజిక్, మూవీస్, వీడియో స్ట్రీమింగ్ సదుపాయం ఉంది. డిజిటల్ పేమెంట్స్ కోసం UPI యాప్ ఉంది.మెక్రోమ్యాక్స్ తో ఒప్పందంలో భాగంగా BSNL రూ.97 ఆఫర్ ఇస్తోంది. అన్ లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ ఉంటుంది.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *